త్రికరణ శుద్ధి అంటే...
త్రికరణశుద్ది అంటే మనసు, చేతలు, మాటలు మూడు ఒకటే చేయడం. మనసా కర్మణా వాచా కోరుకుంటే ఈ సృష్టిలో సాధించలేనిది లేదు.
చాలామంది అంటూ ఉంటారు.. మేము ఇలానే కోరుకుంటాం కానీ జరగడం లేదు ఎందుకని? అని..
నిజమే. మీరు త్రికరణశుద్ది గా కోరుకుంటారు. ఇక్కడ జరిగే తప్పు ఏమిటంటే! మనం ఏదైతే కోరికని విత్తనంగా నాటుతున్నామో.. దానివెనుకే సందేహం అనే విషబీజం కూడా నాటుతున్నాం. ఇతరులను ఇబ్బంది పెడుతున్నాం. త్రికరణశుద్ది గా ఏదైతే అనుకున్నామో దానినే మరలా మరలా తిరిగితిరిగి అదే ఆలోచించడం, దానివెనుకే అవుతుందా! అవ్వదా అనే సందేహ బీజం వేయడం, ఇతరుల బాధ అనే ఎరువు కలవడం వల్ల విషవృక్షం మనం వేసిన మంచి ఆలోచన అనే బీజం కంటే వేగంగా పెరిగి మహావృక్షమై మంచి బీజాన్ని కమ్మేసి పెరగనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎక్కువ శాతం కోరికలు ఆదిలోనే నశించిపోతున్నాయి.
అందుకే పెద్దలు ఆలోచనలు పెట్టుకోకుండా మనస్సుని ఖాళీగా ఉంచడానికి ధ్యానం, యోగం వంటి పద్ధతులు అవలంభించేవారు. అలానే పనులు కూడా ఎక్కువ పెట్టుకునేవారు కాదు. సంపాదనకు అంత విలువ ఇచ్చేవారు కాదు. ఉన్నంతలో సంతోషంగా, సుఖంగా బ్రతికేవారు. ఈనాడు చేసే పని కంటే ఆలోచనలు ఎక్కువ. విలువల కంటే సంపదల కోసం పోరాటం ఆరాటం ఎక్కువ. అందుకే 90% ఆలోచనలు ఆదిలోనే మునిగిపోతున్నాయి. ఏదైనా ఒకటి లక్ష్యంగా పెట్టుకొనేవారు అదే సాధనగా చేయాలి. 100 ఆలోచనలతో, 100 వ్యవహారాలతో, ఇతరులను ఇబ్బంది పెడుతూ ఏదీ సాధించలేరు.
మనం ఏదైనా ఒకపని చేయాలంటే దృఢమైన సంకల్పం ముఖ్యం
0 Comments