GET MORE DETAILS

స్నానాల సబ్బుకు బట్టలు ఉతకటానికి వాడే డిటర్జెంటుకు తేడాలేంటి

స్నానాల సబ్బుకు బట్టలు ఉతకటానికి వాడే డిటర్జెంటుకు తేడాలేంటి.



సబ్బు ఎందుకు దుడ్డు దండుగ సీకాయ మంచిదిరా శిష్యా!

ఇదో జానపదం. కొత్తల్లో సబ్బులు సంతలలోకి (Markets) వచ్చినపుడు కొందరు ప్రాచీనవాదులు పాడిన పాట ఇది.

నిజమే సబ్బులో అనేక రసాయనాలుంటాయి, ఇవిశరీరానికి హాని ( Allergy) కల్గిస్తాయి.సీకాయ ప్రకృతి ప్రసాదం. అందులో ఏ రసాయనముండదు. పావు (50grams) అర్ధశేరు ( 100 grms) శేరు (200 grams) సీకాయను సంతలోనో శెట్టిఅంగడిలోనే నాయన తెస్తే అమ్మ ఆ సీకాయను రోట్లో బాగా నూరి తలంటూ స్నానం చేయించేది. ఎలిన్నాటి మురికి జిడ్డు దెబ్బకు దిగిపోయేది. చేతిలో ఇమిడే చిన్నగరుకు రాయితో*** వళ్ళుతోమితే చర్మంలోపల దాక్కున్న మురికి మటుమాయం అయ్యేది. ఇపుడు సీకాయను మనం మరిచాం, మనతరువాతి తరం (మనపిల్లలు ) పాపం సీకాయను కూడా గుర్తించలేని దీనస్థితిలో వుండిపోయారు.దానిక్కారణం పెద్దలమైన మనమేననుకోండి.

ఇప్పటి 4800 సంవత్సరాల కిందటనే భారతీయులు, ఈజిప్షియనులు, రోమనులు, బాబిలోనియన్లు సబ్బును వాడిన దాఖలాలున్నాయి. కాకపోతే అందులో వాడే దినుసులు ( ingredients) వేరువేరుగా వుండేవి.

ఇంకో పచ్చినిజం తెలుసా ? 3500 సంవత్సరాల కిందట నే షాంపు (Shampoo) ను కనిపెట్టినవారు భారతీయ ఆయుర్వేద వైద్యంలో నిష్ణాతులైన బుుషులే. వనమూలికలను నూనెలను ఉపయోగించి మన బుుషిపుంగవులు షాంపును తయారు చేశారు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న షాంపును 1903 లో జర్మనీదేశంలోని ఓ మహిళ ప్రవేశపెట్టింది. 

నాకు తెలిసినంత వరకు భారతీయుల కోసం భారతీయులే ఉత్పత్తిచేసిన స్నానాల సబ్బు మైసూరు శాండల్ సోప్. 1916 లో బెంగళూరులో  మైసూరు మహారాజు నాలుగవ చామరాజ కృష్ణవడయారు  మైసూరు శాండల్ సోప్ కర్మాగారాన్ని ఏర్పాటుచేశారు. మైసూరు రాష్ట్రమంటేనే (కర్ణాటక) గందం. గందం (గంధం కాదు గందం) చెట్లు మైసూరుప్రాంతంలో విరివిగా దొరికేవి, ప్రస్తుతమున్నాయి కూడా. మైసూరు మహరాజులు ఆ రోజులలో గందం దుంగలను ఐరోపాదేశాలకు ఎగుమతి చేసేవారు. కాని మొదటి ప్రపంచయుద్ధం వలన గందం ఎగుమతులు ఆగిపోయాయి. గందం నిల్వలు పెరిగిపోవడంతో మైసూరుమహరాజుకో ఉపాయం తట్టింది. ఇంకేముంది గందం దుంగలనుండి నూనె తీసి సబ్బుల కార్ఖానా పెట్టాడు. ఏ రసాయనాలు లేకుండా కేవలం ప్రకృతివనరులతో (ingredients) తయారు చేసే ఏకైక సబ్బు మైసూరు శాండల్‌ సోప్ మాత్రమేనండోయ్.

స్నానాలసబ్బును కొన్ని రకాల ఔషధ మొక్కలు, నూనెలు, జంతుకొవ్వులను ఉపయోగించి చేస్తారు. బట్టలసోప్ అదేనండి డిటర్జంట్ లను రసాయనాలతో తయారుచేస్తారు.

డిటర్జంట్ (Detergent) అని బట్టలసబ్బును ఎందుకంటారంటే మురికిని వదలగొట్టే బాపతు కాబట్టి. డిటర్జంట్ కు తెలుగులో అర్థమేమిటంటే మురికిని వదిలించే సాధనం.


Post a Comment

0 Comments