GET MORE DETAILS

దివ్యాంగులకు పరీక్షల్లో మినహాయింపులు

 దివ్యాంగులకు పరీక్షల్లో మినహాయింపులు



దివ్యాంగులకు 6-10 తరగతుల పరీక్షల్లో అదనపు సమయం, కొన్ని పరీక్షలకు సడలింపులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకల్యం ఆధారంగా దివ్యాంగులను ఎనిమిది కేటగిరీలుగా విభజించారు. పరీక్ష రాసేందుకు సహాయకుల అనుమతితోపాటు గంటకు 20 నిమిషాల చొప్పున అదనంగా సమయం కేటాయిస్తారు. వీరికి జంబ్లింగ్‌ ఉండదు. చదివిన పాఠశాల లేదంటే పక్కనుండే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. కుష్ఠు నయమైన వారు, మస్తిష్క పక్షవాతం, ఆటిజం, మానసిక వికలాంగులకు 6-10 తరగతుల్లో పది మార్కులు వచ్చినా ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. అంధులు, కంటి చూపు తక్కువగా ఉన్నవారు, వినికిడి సమస్య ఉన్న వారు, మూగవారికి ఇరవై మార్కులు వస్తే చాలు. పార్కిన్సన్‌, రక్త సంబంధ సమస్యలు, తీవ్ర నరాల సమస్య ఉన్న వారికి మూడో భాష పేపర్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు.

Post a Comment

0 Comments