GET MORE DETAILS

గ్రీటింగ్ కార్డుల కథ ఏమిటి తెలుసుకుందాం

 గ్రీటింగ్ కార్డుల కథ ఏమిటి తెలుసుకుందాం...!

 


కొత్త సంవత్సరం, పుట్టినరోజు, పెళ్లిరోజు, పండగ రోజులలో... స్నేహితులు, బంధువులకు గ్రీటింగ్ కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే. మరి ఇలా కార్డులు ఇచ్చుపుచ్చుకోవడం ఎప్పుడు మొదలైందంటే... సుమారు 600 ఏళ్ళ క్రితం 14వ శతాబ్దంలో చేతితో కాగితాలపై బొమ్మలు వేసి వాటిని యూరప్ లో ఒకరికొకరు ఇచ్చుకునే వారనడానికి ఆధారాలు ఉన్నాయట. అప్పటి గ్రీటింగ్ కార్డులు ఇప్పటికీ లండన్ మ్యుజేయం లో ఉన్నాయట. వీటిని ఎంతోమంది ప్రతి ఏటా సందర్శిస్తున్నారు. అచ్చుయంత్రం కనిపెట్టాక వీటి హంగామా పెరిగింది. మొదటగా జర్మనీ వాళ్ళు ప్రత్యేక సందర్భాల కోసం గ్రీటింగ్ కార్డులను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దేశదేశాల్లో గ్రీటింగ్ కార్డులు ముద్రణ, అమ్మకాలు విపరీతం గా పెరిగాయి. 

✒ కార్డుల కంటే ముందే ఈజిప్టులో ఈ సంప్రదాయం మొదలైనదని అంటారు. ఈజిప్తియన్లు చెట్ల బెరడులపై శుభాకాక్షలు రాసి ఇష్టమైన వారికి ఇచ్చుకునే వారని చెబుతారు. కాగితం కనుగొన్న తరువాత రాతలన్ని దాని మీదకు మారాయన్నమాట. మొత్తం మీద 18వ శతాబ్దం నుంచి వీటి వాడుక పెరిగిపోయింది. ప్రఖ్యాత చిత్రకారులైన "కేట్ గిరవే", "వాల్టర్ క్రేన్" లాంటి వారు రకరకాలైన డిజైన్లలో కార్డులు తయారు చేయించి ముద్రించేవారు. 19 శతాబ్దం వచ్చేసరికి 'మదర్స్ డే & ఫాదర్స్ డే' లాంటి ప్రత్యేక దినాలు పెరిగిపోవడం తో ఉత్పత్తి పెరిగింది. 

మీకు తెలుసా ?

✒ అమెరికా లో ప్రతి ఏడాది 700 కోట్లు గ్ర్రేటింగ్ కార్డులు అమ్ముడవుతున్నాయి . వీటి విలువ 750 కోట్ల డాలర్లు పైమాటే

✒ బ్రిటన్ లో ఏట 100 కోట్ల పౌండ్ల వ్యాపారము జరుగుతుంది.

✒ ఒక మనిషి ఏడాదికి 20 కార్డులైనా అందుకుంటాడని అంచనా.

✒ ఏటా ఆన్ లైన్ ద్వారా 50 కోట్ల గ్రీటింగ్ కార్డ్లులు బట్వాడా అవుతున్నాయని అంచనా.

✒ బెల్జియం లో అతి చిన్న గ్రీటింగ్ కార్డు ను చేసి రికార్డు కొట్టేసారు.

✒ ఆగ్రాలో అతి పెద్ద గ్రీటింగ్ కార్డ్ చేసారు. దాని పొడవు 127 మీటర్లు.

✒ ప్రపంచ వ్యాప్తం గా గ్రీటింగ్ కార్డులలో 60 శాతం క్రిస్టమస్ పండుగకే అమ్ముడవుతున్నాయి.

Post a Comment

0 Comments