GET MORE DETAILS

అష్టతీర్థాల హారం - కూర్మనాథ క్షేత్రం

 అష్టతీర్థాల హారం - కూర్మనాథ క్షేత్రం



శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో ప్రముఖ కూర్మనాథ క్షేత్రం నారద తీర్థం, సుధాగుండం, చక్రతీర్థం, మాధవ గుండం, కౌటిల్య తీర్థం, వక్రతీర్థం, నారసింహ పాతాళం, తూర్పున బంగాళాఖాతం... 8 దిక్కుల్లో అష్టాక్షరీ మంత్రపూరితమైన అష్ట తీర్థాలతో అలరారుతోంది. వాటిలో స్నానమాచరిస్తే శారీరక అలసట, మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తులు విశ్వాసం. ముఖ్యంగా స్వామి సన్నిధిలోని శ్వేత పుష్కరిణిలో స్నానం చేస్తే ఆరోగ్య సంబంధ రుగ్మతలు నయం అవుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రత్యేక దినాల్లో ఈ తీర్థాల్లో దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పుష్కరిణిలో అస్తిక సంచయనం గయాక్షేత్ర ఫలం, విశేషంగా రాహు కేతు, కుజగ్రహశాంతికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని పితృతీర్థం అని పిలుస్తారు. పితృ దేవతలు ఆత్మశాంతికి ఇక్కడ కార్యక్రమాలు జరిపిస్తారు. ఈ క్షేత్రంలో నిత్యం స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకం కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు.

Post a Comment

0 Comments