GET MORE DETAILS

ఒమైక్రాన్‌ కూడా ప్రమాదకరమే _ దాని విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి : అపోలో గ్రూప్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె.హరిప్రసాద్‌

 ఒమైక్రాన్‌ కూడా ప్రమాదకరమే _ దాని విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి : అపోలో గ్రూప్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె.హరిప్రసాద్‌



తేలికపాటిదే అయితే.. ఎందుకింత ప్రచారం ?

ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తులు తేలిగ్గా తీసుకుంటే ముప్పే.

చిన్న జలుబుగా భావిస్తే ఇబ్బందులు తప్పవు.


ఒమైక్రాన్‌తో వచ్చే కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ తేలికపాటిదని, దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి రావడం సరికాదని అపోలో గ్రూప్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె.హరిప్రసాద్‌ హెచ్చరించారు. కొత్త వేరియంట్‌ ప్రమాదకారి కాదనప్పుడు ఎందుకింత ప్రచారమని అన్నారు. అనేక కారణాల వల్ల ఇదొక ప్రమాదకరమైన వేరియంట్‌ అని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. కొవిడ్‌ మహమ్మారి మున్ముందు భారీ ఉప్పెనలకు కారణమై, రెండో వేవ్‌ మాదిరిగా వైద్యరంగంపై పెనుభారం పడొచ్చన్నారు. ఒక శాతం పాజిటివ్‌ కేసులే ఆస్పత్రుల్లో చేరుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

తెలియక సాధారణ వ్యక్తులుగానే :

‘‘ఒమైక్రాన్‌ మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. తేలికపాటి లక్షణాలు ఉండడంతో బాధితులు చిన్న జలుబుగా భావిస్తారు. ఒమైక్రాన్‌ సోకిందని తెలియక అందరితో కలిసి బయట తిరుగుతారు. తద్వారా అనేక మంది ఇతరులకు ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. ఒమైక్రాన్‌ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్‌ సోకదనే అభిప్రాయం వల్ల ప్రజలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు.’’

లక్షణాలు బయటపడ్డా... పరీక్ష చేయించుకోకుంటే...

‘‘ఒమైక్రాన్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. అప్పటికే ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారు ఆస్పత్రి పాలయ్యే ముప్పు ఉంటుంది. ఐసీయూ సంరక్షణ కూడా అవసరం కావచ్చు. కొవిడ్‌ లక్షణాలు బయటపడినా పరీక్షలు చేయించుకోకుంటే.. సోకింది డెల్టానా ?  ఒమైక్రానా ? అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది. సోకింది డెల్టా వేరియంట్‌ అయితే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒమైక్రాన్‌ వల్ల భయం లేదనే ప్రచారం వల్ల వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ప్రజలు వెనుకాడే ప్రమాదం ఉంది. టీకాలు వేయించుకోవడం, బూస్టర్‌ డోసులు తీసుకోవడం చాలా ఉపయోకరమనే విషయాన్ని అందరూ గుర్తించాలి.’’

ఇన్ఫెక్షన్‌ సోకకుండా జాగ్రత్తలివీ...

 కరోనా ఇన్ఫెక్షన్‌ బారినపడకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై డాక్టర్‌ హరిప్రసాద్‌ పలు సూచనలు చేశారు. అవేమిటంటే.. ‘‘మాస్కులు సరైన రీతిలో ఉపయోగించాలి. సమావేశాలకు దూరంగా ఉండాలి. ధారాళంగా గాలి, వెలుతురు ఉన్న ప్రదేశాలలోనే ఉండాలి. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ వేచి చూడకుండా వెంటనే పరీక్ష చేయించుకోవాలి. హోం ఐసొలేషన్‌లో ఎలా ఉండాలనే అంశాలపై అవగాహన పెంచుకోవాలి. మార్గదర్శకాల ప్రకారం ఇమ్యూనైజేషన్‌ డోసులు, బూస్టర్‌ డోసులు వేసుకోవాలి.

Post a Comment

0 Comments