కొవాగ్జిన్ బూస్టర్ డోసుతో ఒమిక్రాన్, డెల్టాలకు చెక్ - ఎమోరీ వ్యాక్సిన్ సెంటర్ చేపట్టిన పరీక్షల్లో నిర్ధారణ : వెల్లడించిన భారత్ బయోటెక్
రెండు డోసుల కొవాగ్జిన్ టీకా వేసుకున్న ఆరు నెలలకు కొవాగ్జిన్ బూస్టర్ డోసు తీసుకుంటే కొవిడ్ వైరస్ డెల్టా, ఒన్ వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తుం దని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ బుధవారం వెల్లడించింది. అమెరికా (అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన ఎమోరీ వ్యాక్సిన్ సెంటర్ నిర్వహించిన ప్రయోగపరీక్షల్లో ఈ విషయం నిర్ధా రణ అయినట్లు పేర్కొంది. భారత్ బయోటెక్, ఆక్యు జెన్ ఇంక్., సహకారంతో ఎమోరీ వ్యాక్సిన్ సెంటర్ ఈ ప్రయోగాలు నిర్వహించింది. ఈ ఫలితాలను -ప్రింట్ సర్వర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయిన 'మెడ్ రిగ్జివ్ త్వరలో ప్రచురించే అవకాశం ఉంది.
90% కంటే ఎక్కువమందిలో...
కొవాగ్జిన్ బూస్టర్ డోసు తీసుకున్న వ్యక్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా, 90% కంటే ఎక్కువ మందిలో 'ఒమిక్రాన్' వేరియంట్ను నిరో ధించే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) అభివృద్ధి చెందినట్లు స్పష్టమైందని భారత్ బయోటెక్ వివరిం చింది. మొత్తం అందరికీ డెల్టా వేరియంట్ను అదుపు చేసే యాంటీబాడీలు కనిపించినట్లు పేర్కొంది. ఈ ప్రయోగ పరీక్షలు నిర్వహించిన ఎమోరీ వ్యాక్సిన్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెహుల్ సుతార్ స్పందిస్తూ, ఒమిక్రాన్ ముప్పు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రజారోగ్య సమస్యగా మారి నట్లు వివరించారు. బూస్టర్ డోసు తీసుకోవడం వల్ల ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లను ఎదుర్కొనగ లిగే రోగనిరోధక శక్తి లభిస్తోందని తాము నిర్వ హించిన ప్రయోగ పరీక్షల్లో తేలినట్లు స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి, బాధితులు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కలగ కుండా నివారించడానికి బూస్టర్ డోసు ఉపయోగప డుతోందని అన్నారు.
నిరంతర ప్రక్రియ: డాక్టర్ కృష్ణ ఎల్ల
కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసే ప్రక్రియను నిరం తరం కొనసాగిస్తున్నట్లు భారత్ బయోటెక్ ఇంట ర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ఒమి క్రాన్, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తుందని నిర్ధారణ కావటంతో, ఈ టీకా ఎంతో ప్రయోజనకారి అనే విషయం స్పష్టమవు తోందన్నారు. ప్రాథమిక, బూస్టర్ డోసుగా కొవా గ్జిన్ టీకా సత్ఫలితాలు సాధించడం తమకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చినట్లు యూఎస్ లోని భారత్ బయోటెక్ వ్యాపార భాగస్వామి అయిన ఆక్యుజెన్ ఇంక్., సీఈఓ శంకర్ ముసునూరి తెలి పారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్ల నుంచి ఈ టీకాతో రక్షణ లభిస్తుందనే విశ్వాసం రెట్టింపు అయినట్లు వివరించారు.
0 Comments