GET MORE DETAILS

Covaxin - కొవాగ్జిన్‌ టీకా వేసుకున్నాక పారాసిటమాల్‌ అవసరం లేదు : భారత్‌ బయోటెక్‌

 Covaxin - కొవాగ్జిన్‌ టీకా వేసుకున్నాక పారాసిటమాల్‌ అవసరం లేదు : భారత్‌ బయోటెక్‌



కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న తర్వాత మందులు వాడకంపై భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన చేసింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారు కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. అనేక టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పారాసిటమాల్ తీసుకోవాలని సూచిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత ఎలాంటి పెయిన్ కిల్లర్లూ వేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

టీకా తీసుకున్న తర్వాత అతి స్వల్ప మందిలో మాత్రమే దుష్పరిణామాలు మాత్రమే ఎదురవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. దాదాపు 30 వేల మందిపై తాము పరిశోధనలు జరపగా.. అందులో కేవలం 10 నుంచి 20 శాతం మందిలో మాత్రమే దుష్పరిణామాలు ఎదురయ్యాయని, ఎలాంటి మందులూ అవసరం లేకుండానే ఒకటి రెండు రోజుల్లోనే దుష్ర్పభావాలు తగ్గుతాయని పేర్కొంది. ఒకవేళ అవసరమైనప్పుడు వైద్యుల సలహా మేరకే మందులు వాడాలని స్పష్టం చేసింది. కొన్ని ఇతర కొవిడ్‌ వ్యాక్సిన్లకు మాత్రమే పారాసిటమాల్‌ సిఫార్సు చేశారని, కొవాగ్జిన్‌కు పారాసిటమాల్‌ను సిఫార్సు చేయడం లేదని తెలిపింది

Post a Comment

0 Comments