బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎంఎస్‌ఎంఈ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 09
పోస్టులు: అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-03; సీనియర్ మేనేజర్లు-03; మేనేజర్లు-03
విభాగాలు: బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. బీఈ/బీటెక్/ఎంసీఏతోపాటు డేటా మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 07
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in
0 Comments