GET MORE DETAILS

భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు

 భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు

 


● నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

● తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

● అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే.

● ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం.

● భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం.బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

● సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

● ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడెమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

● భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.

● ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!

● అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

● మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది "మాంగల్య బంధం"

● బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

● మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

● కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

● నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.

● నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

● ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని "వివాహం"అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

● సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం"కుటుంబం"

● గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

కలిమి లేములతో..

కలసిన మనసులతో...

కలివిడిగా మసలుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!

● బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు.

భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు

భార్యకి భర్త భరోసా కావాలి. భారం కాకూడదు.

భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి. అయోమయం కాకూడదు.

● మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

● అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే... ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

● పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా,కష్టం- సుఖం గురించి కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

● ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.

Post a Comment

0 Comments