GET MORE DETAILS

అభ్యంతరకర పోస్టులకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాధ్యుడు కాదు : హైకోర్టు

అభ్యంతరకర పోస్టులకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాధ్యుడు కాదు : హైకోర్టు



వాట్సాప్ గ్రూపులోని సభ్యులు పెట్టే అభ్యంతరకర మైన పోస్టులకు ఆ గ్రూప్ అడ్మిన్ బాధ్యత వహించ నక్కర్లేదని కేరళ హైకోర్టు తీర్పుచెప్పింది.ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై కేరళ పోలీసు లు నమోదుచేసిన ఆరోపణ లను రద్దుచేసింది.జస్టిస్ కౌసర్ ఎడప్పగథ్ ధర్మాసనం ఫిబ్రవరి 23న ఈ తీర్పు చెప్పింది.లైంగిక నేరాల నుంచి బాలలపరిరక్షణచట్టం(పోక్సో), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం  క్రింద ఈకేసును నమోదు చేశారు.కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన మాన్యువల్ (22) ఓ వాట్సాప్ గ్రూపును ప్రారంభించారు.ఆయన దీనికి అడ్మిన్‌గా వ్యవహరిస్తున్నారు. 2020మార్చి 29న ఈ గ్రూపు లోని ఓమెంబర్ పోర్న్ వీడియోను పోస్ట్ చేశారు. బాలలు లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఈ వీడియోలో ఉంది.2020 జూన్ 15న ఎర్నాకుళం సిటీ పోలీసులు ఆ మెంబర్‌పై కేసు నమోదు చేశారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000; పోక్సో చట్టంలోని సెక్షన్లు 13, 14, 15 ప్రకారం కేసు నమోదు చేశారు.ఆ తర్వాత మాన్యు వల్‌ను రెండో నిందితునిగా చేర్చారు.ఆయన ఈ గ్రూపును క్రియేట్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు.పోలీసులు తుది నివేదికను సమర్పించా రు. దీనిపై ఎర్నాకుళంలోని అదనపు సెషన్స్ కోర్టు విచార ణ జరుపుతోంది.అయితే మాన్యువల్ హైకోర్టును ఆశ్రయించారు.తాను కేవలం గ్రూపు అడ్మిన్‌ను మాత్రమే నని,తనను ఈకేసులో నింది తునిగా చేర్చడం సరికాదని వాదించారు.హైకోర్టు ఆయన కు ఈకేసు నుంచి విముక్తి కల్పించింది.

Post a Comment

0 Comments