GET MORE DETAILS

ఏకదండి, ద్విదండి, త్రిదండి స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా ?

 ఏకదండి, ద్విదండి, త్రిదండి స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా ?



◆ ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. 

◆ స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..

◆ దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...

◆ ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా. 

◆ ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి. 

◆ అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు. 

◆ మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..

◆ అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.  

◆ ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. 

◆ అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.  

◆ గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి, 

◆ కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.  

◆ ఈ కర్రల్లో  మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి. 

ఏకదండి :

● ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. 

● అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు. 

● అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం.

● అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే  సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. 

● వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన  కర్ర ఉంటుంది.

ద్విదండి :

● రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.  

● ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు. 

● వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. 

● జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం. 

● జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.

త్రిదండి :

● మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు. 

● ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. 

● వీరిది రామానుజాచార్యుల పరంపర. 

● శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు. 

● జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, 

● జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, 

● నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై, 

● మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, 

● వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.

ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ, స్వస్తి.

Post a Comment

0 Comments