Ads Area

కథ కంచికి మనమింటికి " అంటే...

0

కథ కంచికి మనమింటికి " అంటే...



"కథ కంచికి మనమింటికి " అంటే ఏమిటో...!!! చిన్నపుడు అర్థమయ్యేదికాదు. కానీ అణుక్షణం అమ్మనే ధ్యానిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నకొద్దీ ఇప్పుడర్థమవుతుంది.   

1) కథ అంటే :  శరీరాలను మారుస్తూ ఆత్మ చెస్తున్న ప్రయాణ ప్రయాస. 

2) ఇంటికి అంటే :  మనలో ఉన్న జీవాత్మకు పరమాత్మయే పుట్టినిల్లు. ఆత్మజ్యోతికి పరం జ్యోతియే అసలు ఇల్లు.

3) కాంచీపురి(కంచి) అంటే : జీవుడికి మళ్ళీ పుట్టాల్సిన అవసరంలేకుండా ధన్యతను చేకూర్చే మోక్షపురి. 

 "కథ కంచికి మనమింటికి" అనే మాటకు క్లుప్తసారాంశమిదే...

ఎవరైతే అత్యంత భక్తిశ్రద్ధలతో కంచి కామాక్షితల్లిని దర్శించుకుని తరిస్తారో వారికి మళ్ళీ పుట్టాల్సిన అవసరముండదు. 

పునర్జన్మ రాహిత్యాన్నీ పొంది పరంజ్యోతిలో ఐక్యమౌతారు. ఇహంలో సర్వసౌఖ్యాలను అనుగ్రహిస్తూ పరంలో  మోక్షాన్ని ప్రసాదించే కరుణగల తల్లియే "కామాక్షి".

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area