GET MORE DETAILS

రావణునకు కుబేరుడు స్వంత తమ్ముడు ఎలా... ?

 రావణునకు కుబేరుడు స్వంత తమ్ముడు ఎలా... ?



(1) ఆదికవి వాల్మీకి వ్రాసిన  కావ్యానికి రామాయణమనే పేరుపెట్టాడు. వాల్మీకి మహర్షి. రామాయణానికే సీతాయాశ్చరితం అనే మరోపేరును కూడా పెట్టాడు.

(2) రామాయణమంటే శ్రీరామచంద్రుడి జీవనగమనమని అర్థము. క్లుప్తంగా చెప్పాలంటే అది శ్రీరాముడి నడక. రామాయణానికి సీతాయణమనే ఇంకోపేరు కూడా వుంది.

(3) రామాయణములో అంజనేయుడు అత్యంత ఉదాత్తమైనవాడు. ఇతనికి భజరంగభళి అనే పేరుకూడా వుంది. అంజనేయుడు నవవ్యాకరణాలలో పండితుడు.

(4) రామాయణము భారతదేశములోనే కాకుండా థాయిలాండ్, ఇండోనేసియా, కంబోడియా, వియత్నాం, లావోస్, జపాన్, చైనా, శ్రీలంక, భూటాన్,నేపాల్ దేశాలలో ఆదరణలోవుంది. ఇంకా ప్రపంచములో వున్న అన్ని భాషలలోకి అనువదించబడింది.

(5) సీతాపహరణము తప్పని రావణుడికి బోధించినవారు మండోదరి (భార్య) కుంభకర్ణుడు, విభీషణుడు, మారీచుడు, ప్రహస్తుడు ( కొడుకు).

(6) రావణుడి పట్టపుమహిషి పేరు మండోదరి. వీరికి ఏడుమంది సంతానము, వారు (అ) ఇంద్రజిత్తు మరోపేరు మేఘనాథుడు (ఆ) ప్రహస్థుడు (ఇ) అతికాయుడు (ఈ) అక్షకుమారుడు (ఉ) దేవాంతకుడు (ఊ) నరాంతకుడు (బుు) త్రిశరుడు.

(7) మేఘనాథుడు యుద్ధంలో లక్ష్మణుడి చేతిలో మరణించాడు. 

ప్రహస్తుడు వానరసేనాని నీలుని చేత మరణించాడు.

అతికాయుడు లక్ష్మణుని చేత మరణం పొందాడు.

అక్షయకుమారుడు హనుమచేత మరణించాడు.

దేవాంతకుడు హనుమచేత మరణించాడు

నరాంతకుడు అంగదుని చేత మరణం పొందాడు

త్రిశిరుడు కూడా అంజనేయుడి చేత మరణం పొందాడు.

(8) రావణుని సోదరసోదరీలు -- (1) కుబేరుడు. కుబేరునికి రావణుడికి తండ్రి ఒకరే, తల్లివేరు, తండ్రిపేరు విశ్రవసుడు.  

(2)కుంభకర్ణుడు,

(3)విభీషణుడనే తమ్ములు,

(4) శూర్పనఖ, అనే సోదరీ.వీరు కైకసి,విశ్రవసుని  సంతానము. 

ఇతర సోదరులు

(5) మత్తుడు,

(6) ఉన్మత్తుడు, 

(7)మహిరావణుడు (మైరావణుడు)

(8) ఖరుడు, 

(9) దూషణుడు.

ఇంకో సోదరి పేరు (10) కుంభిణి.

(9) వైకుంఠవాసుని ద్వారపాలకులైన జయవిజయులు ససనసనాందులనే మునుల శాపానిగురై మూడు జన్మలపాటు రాక్షస జన్మ పొందడానికి సిద్ధపడతారు. జయవిజయులు కింది విధంగా మూడు  జన్మలెత్తుతారు.

(అ) కృతయుగములో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపులు.

(ఆ) త్రేతాయుగములో రావణాసురుడు, కుంభకర్ణులు.

(ఇ) ద్వాపరయుగములో శిశుపాలుడు, దంతవక్ర్తలు.

(10) శ్రీమహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడు.  సాక్షాత్తూ లక్ష్మీ మాతే సీతాదేవిగా అవతరించింది. ఆదిశేషుడు లక్ష్మణుడిగా జన్మించాడు.

శ్రీమహావిష్ణువు యొక్క శంఖచక్రాలు శత్రుఘ్నభరతులుగా అవతరించాయి. పరమశివుడి అంశయే హనుమంతుడు. 

॥సేకరణ॥

బి.విశ్వనాథ.9441245857. 

అనంతపురం.

Post a Comment

0 Comments