GET MORE DETAILS

కొవ్వును కరిగించే ఆహారాలు

కొవ్వును కరిగించే ఆహారాలు



వయసు పెరుగుతున్నవారిలో జీవక్రియలు మందగిస్తాయి. దీనివల్ల శరీరంలో కొవ్వు మోతాదు నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది.

శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట, నడుములు మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది. జీవనశైలిలో మార్పులు , కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో ఆహారంలో మార్పులు చేసుకోవటం ద్వారా కొవ్వును కరిగించు కోవచ్చు. కొవ్వును కరిగించేందుకు దోహదపడే ఆహార పదార్థాలు.

కొవ్వును కరిగించే ఆహారాలు

ఓట్స్ : రుచికే కాక ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైనవిగా ఓట్స్ ను చెప్పవచ్చు . ఓట్స్ లో ఉండే ఫైబర్ శరీరంలోని కొలస్ట్రాల్ స్ధాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆకలిని కూడా తగ్గిస్తుంది.

గుడ్లు: ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లలో కేలరీలు చాలా ఎక్కవ. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్ధాయిలు పెరుగుతాయి. కండరాలకు బలాన్ని ఇస్తాయి.

పచ్చి మిరపకాయలు : పచ్చి మిరపకాయల్లో క్యాప్ల్సైసిన్ అనే పదార్ధం వల్ల శరీర ఎదుగుదలకు దోహదం చేసే కణాలు అభివృద్ధి చెందుతాయి. కేలరీలు తగ్గించటానికి సహాయకారిగా పనిచేస్తాయి.

వెల్లుల్లి : వెల్లుల్లి లోని ఆలిసిన్ అనే రసాయనం యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. శరీరంలోని కొవ్వును, చెడు కొలస్ట్రాల్ ను తగ్గించటానికి సహాయం చేస్తుంది.

టమాటో : మనం తీసుకునే ఆహారంలో టమాటోలను చేర్చుకోవటం వల్ల క్యాన్సర్ కలిగించే కణాలను నాశనం చేస్తుంది. అంతేకాకుండా కొవ్వును త్వరితగతిన తగ్గించేందుకు ఉపకరిస్తుంది.

డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్ లోని ఫ్లావనాయిడ్స్ , రక్తంలోని కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గిస్తాయి. కొవ్వును కరిగించటానికి ఉపయోగపడతాయి.

ఆపిల్ : ఆపిల్ శరీరంలోని కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రోజుకో ఆపిల్ తింటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

తేనె : కొవ్వును కరిగించే పదార్ధాలలో తేనె ముఖ్యమైనది. గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి ప్రతిరోజు పరగడుపున తీసుకోవటం వల్ల కొవ్వులు కరిగిపోతాయి.

గ్రీన్ టీ : బరువు తగ్గించటానికి, కొవ్వులు కరిగించటానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. రోజుకు రెండు కప్పుల టీ తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు శరీర బరువును క్రమపద్దతిలో ఉంచుతాయి.

Post a Comment

0 Comments