GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

 ఆరోగ్యమే మహా భాగ్యం



1) ఆయుర్వేద చిట్కా : దంత సంరక్షణ

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. దంత సంరక్షణ చాలా అవసరమని ఆయుర్వేదం చెబుతోంది. ప్రస్తుతం రకరకాల పేస్టులు వచ్చాయి. కానీ, పూర్వపు రోజుల్లో వేప బెరడుతో అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకునే వారు. ఇలా చేయడం వలన వారి దంతాలు ఆరోగ్యంగా ఉండేవి. ఆయుర్వేదంలో కూడా వేపతోనే దంతాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజా వేపపుల్లతో లేదంటే, బొగ్గుతో పళ్లను శుభ్రం చేసుకోవడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.

2) మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా ?

టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని అనేక పరిశోధనలు నిరూపించాయి. అలా చేస్తే టీ రుచి, వాసన, టానిన్లను కోల్పోతుంది. చెడిపోయిన టీలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. దాన్ని వేడి చేసి తాగితే అనారోగ్యం. హెర్బల్ టీని మళ్లీ వేడిచేస్తే పోషకాలు తగ్గిపోతాయి. ఇలా టీని ఎక్కువసార్లు వేడి చేసి తాగితే.. కడుపునొప్పి, అతిసారం, వికారంలాంటివి రావొచ్చు. ♨ 4 గంటలకు పైగా నిల్వఉంచిన టీని మళ్లీ వేడి చేసి తాగకండి

 3) మైగ్రేన్‌కు ఇలా చెక్ పెట్టండి!

ఈ రోజుల్లో మైగ్రేన్ చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. రోజుకు 7-8 గంటలు నాణ్యమైన నిద్ర కావాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, టైంకి భోజనం చేయాలి. కెఫెన్‌ కలిగిన పానీయాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగాలాంటివి సహకరిస్తాయి. తలనొప్పికి దారితీసే కారణాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండాలి. మెడిసిన్ రెగ్యూలర్‌గా వాడుతూ, అలవాట్లు మార్చుకోవాలి.

4) కిడ్నీ సమస్యలను ఇలా గుర్తించండి.

1. మూత్రం తక్కువగా రావడం.

2. రాత్రివేళల్లో అతిమూత్రం

3. మూత్రంలో నురుగు రావడం

4. ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు

5. ముఖం లేదా శరీరం ఉబ్బడం

6. హై బీపీ

7. మూత్రం ఎర్రగా లేదా కోలా రంగులోకి మారడం

8. చూపు మందగించడం 

రోజూ కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగాలి. పెయిన్ కిల్లర్లు అతిగా వాడొద్దు.

5) తిన్నాక నడక మంచిదేనా ?

భోజనం తిన్న తర్వాత నడక మంచిదే అంటున్నారు పరిశోధకులు. తాజాగా 30 వేలమందిని వారం పాటు తిన్న తర్వాత నడిపించి శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాకింగ్ వల్ల వారిలో గుండెకు సంబంధించిన రిస్క్ 20 శాతం తగ్గిందట. గ్యాస్, ఎసిడిటీ సమస్యలూ తగ్గినట్లు గుర్తించారు. నడక వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి శరీరానికి పోషకాలు అందుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ నడక డయాబెటిస్ పేషంట్లకు మరీ మంచిదని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments