GET MORE DETAILS

రాత్రి వేళ సైకిల్‌పై ఐపీఎస్‌ అధికారిణి గస్తీ : తమిళనాడు సీఎం అభినందన

 రాత్రి వేళ సైకిల్‌పై ఐపీఎస్‌ అధికారిణి గస్తీ : తమిళనాడు సీఎం అభినందనచెన్నై, లో రాత్రిపూట సైకిల్‌పై పర్యటిస్తూ మహిళా ఐపీఎస్‌ అధికారి గస్తీ నిర్వహించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆమెను అభినందించారు. 2008 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రమ్య భారతి.. గ్రేటర్‌ చెన్నై ఉత్తర మండల సంయుక్త పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి చెన్నైలోని ఫ్లవర్‌ బజారు నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. పోలీసులు విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. రోడ్లపై తిరుగుతున్న అనుమానితులను విచారించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ విషయం దుబాయ్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టికి వెళ్లింది. ట్విటర్‌ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments