GET MORE DETAILS

సోమవారం ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చలు

 సోమవారం ఉక్రెయిన్- రష్యా  మధ్య శాంతి చర్చలు



ప్రపంచం ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రెండు దేశాల మధ్య శాంతి చర్యలు జరగనున్నాయి.గత రెండు విడతల చర్చలు విఫలం అయ్యాయి. పశ్చిమ దేశాల రష్యాపై ఆంక్షలు విధించడం యుద్దం ప్రకటించడం లాంటిదేనన్నారు అధ్యక్షుడు పుతిన్.ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఉక్రెయిన్‌ గగనతలాన్ని 'నో ఫ్లై జోన్' గా ప్రకటించే ప్రయత్నం చేస్తే యుద్ధంలోకి దిగినట్లేనని హెచ్చరించింది రష్యా. రష్యా యుద్దం వల్ల ఇప్పటికే సుమారు 15 లక్షల మంది శరణార్ధులను పశ్చిమ దేశాల వైపు యూరోపియన్ యూనియన్ లోకి వెళ్ళేట్లు చేసింది.ఇదిలా వుంటే చర్చలకు రెడీ అవుతున్న వేళ ఉక్రెయిన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది రష్యా. ఇప్పటివరకూ జరిగిన చర్చలకు ఉక్రెయిన్ ప్రతినిధిగా వచ్చిన డెనిస్ కిరీవ్ ను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ కాల్చి చంపిందని రష్యా పేర్కొంది. రష్యాకు సమాచారం లీక్ చేస్తున్నాడన్న ఆరోపణలతో డెనిస్ కిరీవ్ ను అరెస్ట్ చేసేందుకు ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ప్రయత్నించారని, ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో కిరీవ్ మరణించాడని రష్యా వర్గాలు తెలిపాయి.రష్యా-ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో చర్చలు జరిగిన సమయంలో డెనిస్ కిరీవ్ చివరిసారిగా దర్శనమిచ్చాడు. అయితే, అతడిని సెక్యూరిటీ దళాలు కాల్చి చంపాయన్న రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Post a Comment

0 Comments