శ్రీవారి భక్తులకు శుభవార్త - ఇక విశాఖలోనే వెంకన్న దర్శనం. వివరాలివే...
వైజాగ్ (Vizag) అంటే అందరూ బీచ్ (Vizag Beach) అనుకుంటారు.
ఆ తర్వాత కైలాసగిరిని సందర్శిస్తున్నారు. విశాఖ వాసులకు తిరుమల వెంకన్న దర్శనం (Tirumala Temple Darshan) కావాలంటే మాత్రం గంటల తరబడి ప్రయాణించి ఏడుకొండలకు చేరుకోవాలి.
వైజాగ్ (Vizag) అంటే అందరూ బీచ్ (Vizag Beach) అనుకుంటారు. ఆ తర్వాత కైలాసగిరిని పేరు చెబుతారు. ఇకపై తిరమల శ్రీవారి ఆలయం కూడా కనిపిస్తుంది.. విశాఖ వాసులకు తిరుమల వెంకన్న దర్శనం (Tirumala Temple Darshan) కావాలంటే మాత్రం గంటల తరబడి ప్రయాణించి ఏడుకొండలకు చేరుకోవాలి. కానీ ఇప్పుడు ఆ వైకుంఠవాసుడే విశాఖ తరలివస్తున్నాడు. భక్తులను కరుణించేందుకు విశాఖపట్నం (Visakhapatnam) లో తిరుమల వెంకన్న కొలువుదీరనున్నాడు. ఏడుకొండలవాడు ఎండాడలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నాడు. నగరంలో తిరుమల తరహాలో వేంకటేశ్వరుని ఆలయం నిర్మాణాం టిటిడి ఆద్వర్యంలో పూర్తైంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం ప్రజలుకు అందుబాటులోకి రానుంది. ఎండాడ సర్వే నంబరు 20పి, 191పిలో వేంకటేశ్వరస్వామి నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. నిర్మాణంకు అయ్యే నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చింది. రూ.28 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం టిటిడి మాదిరిగానే తీర్చిదిద్దారు.*తిరుమలలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఎంవీపీ కాలనీలో టీటీడీ కల్యాణ మండపం, దానికి ఎదురుగా టీటీడీ వారి ఈ–దర్శనం కౌంటరు ఉన్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన పనులు ఈ నాటికి పూర్తి అయ్యాయి. కోవిడ్ కారణంగా లేటు అయిన 23వ తేదిన సీఎం చేతులు మీదుగా దీనిని ప్రారంభించనున్నారు.
ఆలయం ప్రారంభమైన నాటి నుంచే టీటీడీ దివ్యక్షేత్రం వేంకటేశ్వరుని దివ్యదర్శనం, స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లలేనివారు ఇక్కడ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ప్రసాదాలు,ప్రత్యేక పూజుల చేయ్యించుకోవచ్చు తిరుమలలో ఎవిదమైన పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కుడా అలాంటి సేవలను ఎర్పాటు చేసారు. భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా అన్ని ఎర్పాట్లు చేసారు. మెుత్తం మీద ఎపుడెప్పుడా అని ఎదురు చుస్తున్న వేంటేశ్వరస్వామి మరికొన్ని రోజుల్లోని దర్శనం ఇచ్చేందుకు రానుండంతోభక్తులు వేయ్యి కళ్లతో ఎదురు చుస్తున్నారు.
18 నుంచి శ్రీమహాలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 23 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తితిదే నుంచి ప్రత్యేకంగా సిబ్బంది విశాఖకు రానున్నారు.18న రాత్రి 7 గంటలకు అంకురార్పణ, 7.30 గంటలకు కలశ స్థాపన, 21 మధ్యాహ్నం వేంకటేశ్వర స్వామి విగ్రహ స్థాపన, 22న సాయంత్రం 4.30 గంటలకు మహాశాంతి, అభిషేకం, 23న ఉదయం 9.20 నుంచి 10.30 గంటల మధ్యలో మహా సంప్రోక్షణ తదితర పూజలు చేస్తారు. అదే రోజు సాయంత్రం 3 గంటలు నుంచి శ్రీమహాలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 23న జరిగే మహా సంప్రోక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ ప్రారంభానికి రావలని దేవదాయ శాఖతో పాటు టీటీడీ కూడా సీఎంను ఆహ్వానించింది.
0 Comments