GET MORE DETAILS

ఎస్​బీఐ ఖాతాదారులకు హెచ్చరిక. క్లిక్‌ చేస్తే డేంజర్లో పడ్డట్టే...!

 ఎస్​బీఐ ఖాతాదారులకు హెచ్చరిక. క్లిక్‌ చేస్తే డేంజర్లో పడ్డట్టే...!



ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు అలెర్ట్‌. కరోనా సంక్షోభంలో సైబర్‌ నేరస్తులు మీకు చెప్పి మరి కష్టపడ్డ సొమ్మును కాజేస్తున్నారని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. ఇటీవల కాలంలో కేవైసీ పేరుతో సైబర్‌ నేరస్తులు బ్యాంక్‌ అకౌంట్‌లలో నుంచి డబ్బుల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తూ బ్యాంక్‌ ఖాతాదారులకు జాగ్రత్తలు చెప్పింది. 

కేవైసీ అప్‌డేట్‌ చేయండి. లేదంటే...

టెక్నాలజీ పెరిగిపోయే కొద్ది ఏది నిజమో, ఏది డూఫ్లికేటో తెలుసుకునేలోపే అనర్ధాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌ అకౌంట్ల విషయంలో ఎక్కువగా జరుగుతుందని ఎస్‌బీఐ తెలిపింది. టెక్నాలజీపై ప్రజల్లో అవగాహాన పెరిగే కొద్ది సైబర్‌ నేరస్తులు కొత్త మార్గాల్ని అన్వేస్తున్నట్లు ఎస్‌బీఐ ట్వీట్‌లో పేర్కొంది. అచ్చం ఎస్‌బీఐ ఎస్‌ఎంఎస్‌ను పోలి ఉండే ఓ కేవైసీ డూబ్లికేట్‌ మెసేజ్‌ను బ్యాంక్‌ అకౌంట్ల వినియోగదారులకు సెండ్‌ చేస్తున్నారు. అందులో మీ కేవైసీ వివరాలు అప్​డేట్ చేయాలని, 24 గంటల్లో పూర్తి చేయకుంటే బ్యాంక్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరిస్తారు.

ఇదీ చూడండి : క్రికెట్ లో నాలుగేళ్ళ బుడతడి ప్రతిభ

Post a Comment

0 Comments