GET MORE DETAILS

భోజనం చేసిన తర్వాత మనల్ని ఎడమ వైపు నిద్ర పోవడం చాలా ఉత్తమం అని పెద్దలు ఎందుకు చెపుతున్నారు ?

భోజనం చేసిన తర్వాత మనల్ని ఎడమ వైపు నిద్ర పోవడం చాలా ఉత్తమం అని పెద్దలు ఎందుకు చెపుతున్నారు ?



● భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది..

● మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది..

● అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది నిద్ర పోవడం మంచిది .

● ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను..

● ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి . 

● రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది.

పడుకునే విధానం :

◆ ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి. 

◆ దీనిని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు. 

◆ మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది. 

◆ ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది. 

◆ మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది. 

◆ మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .

ప్రయోజనాలు (Benefits ) :

1. గురక తగ్గి పోవును.

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును.

3. భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది.

4. వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు. 

5. శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది.

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును.

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి. 

8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును. 

9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును. 

10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి. 

11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు. 

12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి.

13 . మెదడు చురుకుగా పని చేస్తుంది. 

14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది. 

15 . ఆయుర్వేదం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి.

# ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం.

# కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును.

# ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును.

# మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

గమనిక : 

# తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి.

# ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది.

Post a Comment

0 Comments