GET MORE DETAILS

శుభాలు తెచ్చే పరమ పవిత్ర చిహ్నం "స్వస్తిక్"

 శుభాలు తెచ్చే పరమ పవిత్ర చిహ్నం "స్వస్తిక్"



● భారతీయ సంస్కృతిలోను,హిందూ సంస్కృతిలోను "స్వస్తిక్"చిహ్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది."స్వస్తిక్" చిహ్నం మంగళదాయకమైనది.

● చాలామంది "స్వస్తిక్"చిహ్నాన్ని ఇంటి సింహా ద్వారానికి కుడి,ఎడమవైపుల చిత్రీకరిస్తున్నారు.

● సాధారణంగా "స్వస్తిక్ "చిహ్నం కాషాయం, ఎరుపు, రంగులలో ప్లాస్టిక్ వాటిల్లోను,కాపర్,ఇత్తడి మొదలగు వాటిలోను లభ్యమవుతుంది.

● బహు శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని మన ఇంటికి చేర్చే అద్భుత చిహ్నమే "స్వస్తిక్".

● ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ చేరుతుటే ,నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు హాని కలిగించే విపరీతమైన శక్తులు ఏమైన ఉంటే తగ్గిపోతాయన్నది వాస్తవం. మనం ఏదైన శుభం జరగాలని ఆశించినప్పుడు మనం స్వస్తి అని వ్రాయటంగాని, స్వస్తి అనే మాటతో ప్రారంభించటంగాని చేస్తే మంచిది.స్వస్తి అంటే "జయం"అంటారు.

● ప్లాస్టిక్,కాపర్,ఇత్తడి ,పంచలోహాలతో చేసిన "స్వస్తిక్"చిహ్నాన్ని శుక్రవారంగాని ,దీపావళి రోజునగాని లక్ష్మీ అష్టోత్తరంతోగాని,లలిత సహస్త్రనామంతోగాని పూజచేసి ఇంటి సింహాద్వారానికి కుడి, ఎడమవైపుల ఉంచిన పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటిలోకి చేరుతుంది...

● "స్వస్తిక్ "చిహ్నాన్ని బీరువాకి గాని ,గల్లాపెట్టేలో గాని ఉంచిన ధనాభివృద్ధి ఉంటుంది. వ్యాపార స్ధలంలో ఉంచిన వ్యాపారాభివృద్ధి ఉంటుంది.

Post a Comment

0 Comments