Ads Area

సాక్షి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ ను అభినందించిన సిపి కాంతిరాణా టాటా

0

సాక్షి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ ను అభినందించిన సిపి కాంతిరాణా టాటా



యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని కవర్ చేసేందుకు వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చిన సాక్షి టీవీ వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టాటా అభినందించారు. అత్యంత భయానక పరిస్థితుల్లో వృత్తి ధర్మం కోసం పనిచేయడం గొప్ప విషయమని జర్నలిస్ట్గా శ్రీనివాస్ తన జీవితంలో మరో మెట్టు ఎక్కేందుకు ఇలాంటి ఘటనలు దోహదపడతాయి అన్నారు. కళ్ళారా చూసిన శ్రీనివాస్ను అక్కడి యుద్ధ పరిస్థితులు, ఉక్రెయిన్ లో స్థానిక పరిస్థితుల సమాచారం అడిగి తెలుసుకున్నారు.. శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సాక్షి టీవీ ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ గారి ప్రోత్సాహంతోనే తాను దేశం కాని దేశం లో విధులు నిర్వహించానని, ఈ అవకాశం ఇచ్చిన సాక్షి టివి మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area