Ads Area

వడదెబ్బ - ఆరోగ్యమే మహాభాగ్యం !!

0

వడదెబ్బ - ఆరోగ్యమే మహాభాగ్యం !!



వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే,  ప్రతిరోజూ తేలికపాటి ఆహారంలో, ఉల్లి, మజ్జిగ, నిమ్మరసం మొదలైనవి తీసుకుంటు, తగినంత నీరు తరుచూ త్రాగడం ఆరోగ్యానికి మంచిది.

వేసవి కాలం : 

■ ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది, శరీరంలో నీటిశాతం తగ్గితే, వడదెబ్బ తగులుతుంది, అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి, ఇంకా ఎండల్లో ఎక్కువ తిరకుండా ఉండాలి, అధికంగా ఎండలో తిరగటంతో రక్తకణాలు కుంచించుకుపోతాయి, అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌ దెబ్బతినడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

■ వడదెబ్బకు గురైన వారిలో తలతిరగడం, జ్వరం రావడం, చెమటలు రాకుండా, అధిక టెంపరేచర్‌తో పల్స్‌ పడిపోవటం, మతి కోల్పోవటం, కోమాలో పడిపోవటం వంటి లక్షణాలు కనబడతాయి, వీటి ద్వారా ఆకస్మిక మరణం కూడా సంభవించవచ్చు, వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే, శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం చేయాలి.

■ అధికంగా ఎండలో తిరగడం ద్వారా, మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతాయి, తద్వారా అత్యధికంగా వడదెబ్బతో మరణాలు చోటుచేసుకుంటాయి, వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేదతీరేలా చేయాలి, బట్టలు వదులు చేసి నీళ్లతో తడపాలి, ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలమని, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు, ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు, ఐవి ఫ్లూయిడ్స్‌ అందించాలని వారు చెప్తున్నారు.

■ ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్‌లు, లైట్ కలర్ బట్టలు మొదలైనవి ఉపయోగించడం మంచిది, ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం, ఒకవేళ  తప్పనిసరి అయిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి గంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు  6, 7 లీటర్లకు తగ్గకుండా స్వేచ్ఛమైన నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


🌳🌳☀️🔥☀️🌳🌳

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area