GET MORE DETAILS

పిల్లలు లావుగా ఉంటే ఏం చెయ్యాలి...? తిండి తగ్గించవచ్చునా...?

 పిల్లలు లావుగా ఉంటే ఏం చెయ్యాలి...? తిండి తగ్గించవచ్చునా...?కొంతమంది పిల్లలు లావుగా ఉన్నప్పటికీ, యుక్తవయస్సు వచ్చే సరికి సన్నబడిపోతారు. కానీ ఎల్లప్పుడూ ఇలా జరగదు. ఈ మధ్య ఒక పరిశోధన చేసారు.

5.5 ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 60 శాతం మంది 20 ఏళ్ల వయస్సులో కూడా బరువు ఎక్కువే ఉన్నారు.

2.5 ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 44 శాతం మంది 20 ఏళ్ల వయస్సులో కూడా బరువు ఎక్కువే ఉన్నారు. 

ఐతే నడి వయస్సు వరకు కొనసాగిన పరిశోధనలు లేవు. ఎదిగే వయస్సులో బరువు కాస్త తగ్గినా, అది మధ్య వయస్సులో తిరిగి వచ్చేస్తుంది. ఎవరైనా వయసు పెరిగిన కొద్దీ, కాస్తో కూస్తో కొవ్వెక్కుతుంటారు, చిన్నప్పుడు సన్నగా ఉన్నవారు కూడా చాలామంది పెద్దయిన తరవాత లావెక్కుతారు.

బైట దొరికే చాక్లెట్లు, స్కెట్లు, పీజాలు, బర్గర్లు, ఫాసత్ ఫుడ్స్ వంటివి ఏవీ ఇవ్వకుండా ఉండడం మొదటి పాయింటు. ఎందుకంటే వాటిలో తీయదనం కొరకు శుక్రలోజ్, రుచిని పెంచడం కొరకు అజీనమోటో వంటి రసాయన పదార్థాలు కలుపుతారు. అవి పిల్లల శారీరక ఎదుగుదలను మరియు మెదడులోని నరాల ఎదుగుదలను అడ్డుకుంటాయి. అందువల్ల అవి పిల్లల ఆరోగ్యానికి అత్యంత హానిని కలగజేశాతాయి.

ఇవి ఇవ్వడం మానేస్తే చాలు :

ఇక ఇంటిలో చేసిన ఆహారపదార్థాలు ఏవి ఇచ్చినా మంచిదే.

పిల్లలు స్కూల్ కు వెళ్ళే సమయంలో స్నాక్స్ కావలని మారాం చెయ్యడం సహజం అటువంటి సందర్భాల్లో చాక్లెట్లు, చిప్స్ వంటి వాటి బదులు ఇంటిలో చేసిన (వేరుశనగ) పల్లీ పట్టేలు, బెల్లం వేరుశనగ ఉండలు, మినప సున్నీ ఉండలు, నువ్వులు బెల్లంతో చేసిన ఉండలు, ఇంట్లోనేచేసిన బూందీ, కారా వంటివి ఇవ్వడం ఉత్తమం.

పిల్లలు ఏం తినాలి ? ఎంత తినాలి ? ఎలా తినాలి ? జంక్ ఫుడ్ నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి ?

బిడ్డకు ఊబకాయం వచ్చేసిన తరవాత తల్లిదండ్రులు చెయ్యగలింగింది ఎక్కువ ఉండదు. ఐనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే వేరే సమస్యలు రావచ్చును.

1. ఆత్మన్యూనతాభావం : బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులు ఏమీ చెయ్యకండి. పిల్లల మనసు గాయపడుతున్నట్లు గ్రహించడం సులభం కాదు.

2. తిండి : బిడ్డకు తిండి తగ్గించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఆలా చేస్తే బిడ్డ మనసుకు సంకేతాలు తప్పుగా వెళతాయి. ఆహారనియమాలు కుటుంబానికి ఉండాలి, బిడ్డకు కాదు. పిల్లలకు విలువలు మీ నుండి, సమాజం నుండీ వస్తాయి.

3. వ్యాయామం : శారీరక శ్రమను ప్రోత్సహించండి కాని ఎటువంటి బలవంతం లేదా ఒత్తిడి లేకుండా. వ్యాయామ సంస్కృతి ఉండవలసింది కుటుంబానికి.

4. మానసిక ఆరోగ్యం : బిడ్డ ఎక్కువ తినటానికి కారణం వత్తిడి, ఆందోళన, అభద్రతా భావం కావచ్చును. సందర్భాన్ని బట్టి నిపుణులను (పిల్లల డాక్టర్) సంప్రదించండి.

5. జీవనశైలి : ఏవైనా మార్పులు ఎల్లకాలం పాటించగలిగే లాగా ఉండాలి. రోజూ స్నానం చేసినట్లు, లేదా పళ్ళు తోముకున్నట్లు. మార్పులు జీవనశైలిలో భాగం కావాలి.

6. ఫలితాలు : ఫలితాల కోసం చూడవద్దు. ఫలితాలు రావటానికి చాలా కాలం పెట్టవచ్చును. ఫలితాలను కనిపెట్టడం కష్టం కావచ్చును కూడా.

జబ్బుకన్నా మందు కష్టం కాకూడదు : నిరంతరం బరువు తగ్గటం లేదన్న భావనతో బాధ పడటం కన్నా ఊబకాయంతో బాధపడటం మేలు కావచ్చును.

సమర్థులు సరైన పనులు చేస్తారు, అంత సమర్థులు కాని వారు సులభమైన పనులు చేస్తారు.


Post a Comment

0 Comments