GET MORE DETAILS

రోడ్లు తాగునీటిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు...

 రోడ్లు తాగునీటిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు...



✍️రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు......


✍️పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు.....


✍️ అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు.....


✍️ చేపట్టే పనులన్నింటిలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం సూచించారు...


✍️ఇప్పటికే చాలా రోడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు....


✍️ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన రోడ్లకు వెంటనే శాఖాపరమైన అనుమతులకు సీఎం ఆదేశించారు.


✍️ టెండర్లు పూర్తి చేసి జూన్ నెలాఖరు లోపు పనులు పూర్తి చేయాలన్నారు....


✍️మరో వైపు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అధికారులను ప్రశ్నించారు...


✍️ ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలుపగా నిధులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు...


✍️వీటితో పాటు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు....


✍️ నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాల సహకారం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు...

Post a Comment

0 Comments