GET MORE DETAILS

కుళ్లిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది ?

కుళ్లిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది ?



 పాడైన గుడ్లు మాత్రమే కాదు, ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటిలో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకు, కుళ్లిపోయిన గుడ్డుకు సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణం. సాధారణంగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా అది నీటిలో మునుగుతుంది. కుళ్లిపోయిన గుడ్డు కూడా అదే పరిమాణంలో ఉన్నప్పటికీ దానిలో నుంచి కొన్ని బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్లిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది. 

ఏదైనా ఒక వస్తువు ఘన పరిమాణం తగ్గకుండా, దాని ద్రవ్యరాశి మాత్రం తగ్గిందీ అంటే దానర్థం.. ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే.

ఉదాహరణకు... ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బంధించామనుకుందాం. అప్పుడు ఆ పాత్రలో సాంద్రత కేవలం 5-6 కోట్ల గాలి కణాలు మాత్రమే ఉంటాయ్. పాత్ర అలాగే ఉన్నప్పటికీ, లోపలి గాలి తీసేస్తే.. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్లిన గుడ్డు విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఆ గుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటం వల్ల అది తేలుతుంది.

ఈ సందర్భంగా మనం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాలి. ఒకవేళ కోడిగుడ్డును చిక్కని ఉప్పునీటిలో వేసినట్లైతే గుడ్డు కన్నా ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా ఉన్నందున.. ఆ నీటిలో వేసిన గుడ్డు మంచిదైనా, పాడైనదైనా తేలుతుంది.

Post a Comment

0 Comments