GET MORE DETAILS

వీటి పొడిని ఒక్క స్పూన్ పాల‌లో క‌లిపి రోజూ తాగితే చాలు... ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

వీటి పొడిని ఒక్క స్పూన్ పాల‌లో క‌లిపి రోజూ తాగితే చాలు... ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. WALNUTS POWDER WITH MIlK (పాలతో ఆక్రోట్ పొడి)

వాల్ నట్స్‌... వీటినే అక్రోట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చూసేందుకు అంత ఆకర్ష‌ణీయంగా ఉండ‌వు. మెద‌డులా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అయితే వాస్త‌వానికి వాల్ న‌ట్స్‌ను డ్రై ఫ్రూట్స్‌లో అగ్ర‌గామిగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇత‌ర అన్ని డ్రై ఫ్రూట్స్ లో క‌న్నా ఎక్కువ పోష‌కాలు వీటిలోనే ఉంటాయి. అలాగే ఇవి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజనాల‌ను అందిస్తాయి. వాల్ న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. ఏకాగ్ర‌త వ‌స్తుంది. చిన్నారులు అయితే చ‌దువుల్లో రాణిస్తారు. తెలివితేట‌లు పెరుగుతాయి. అన్ని ర‌కాల మాన‌సిక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డాలంటే రోజూ వాల్ న‌ట్స్‌ను తినాలి. వాల్ న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల ఇంకా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి.

వాల్ న‌ట్స్ ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్ స‌మ‌యంలో తిన‌వ‌చ్చు. రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వీటిలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెద‌డును యాక్టివ్‌గా ఉంచుతాయి. దీంతో బ‌ద్ద‌కం పోయి చురుకుద‌నం వ‌స్తుంది. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. క‌నుక వాల్ న‌ట్స్‌ను రోజూ తినాలి. వీటిని రోజూ తింటే ముఖంపై ముడ‌త‌లు పోతాయి. వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. డిప్రెష‌న్‌, ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గ్గుతాయి. గ‌ర్భిణీలు వీటిని తింటే పిండం ఎదుగుల‌కు ఎంత‌గానో స‌హాయ ప‌డతాయి. వాల్‌న‌ట్స్‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని ర‌కాల మిన‌ర‌ల్స్ ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబ‌ర్‌తోపాటు కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, మాంగ‌నీస్‌, పొటాషియం.. వంటి పోష‌కాల‌ను వాల్ న‌ట్స్ మ‌న‌కు అందిస్తాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి.

రోజంతా అలసిపోయేలా ప‌నిచేసేవారు లేదా ఎల్ల‌ప్పుడూ నీర‌సంగా శ‌క్తి లేన‌ట్లు ఫీల‌య్యేవారు.. వ్యాయామం అధికంగా చేసేవారు.. వాల్ నట్స్‌ను తింటే అమిత‌మైన శ‌క్తి ల‌భిస్తుంది. ఇది వారిని ఉత్సాహంగా మారుస్తుంది. శ‌క్తి మొత్తం తిరిగి వ‌స్తుంది. మ‌ళ్లీ ఉత్సాహంగా ప‌నిచేస్తారు. ఇక వాల్ న‌ట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను సంర‌క్షిస్తాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. ర‌క్తనాళాల్లో ఉండే అడ్డంకుల‌ను తొల‌గించి ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. అలాగే అధిక బ‌రువు త‌గ్గుతారు. మ‌తిమ‌రుపు నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాలు ర‌క్తం శుద్ధి అవుతుంది. అయితే వాల్ న‌ట్స్‌ను చాలా మంది నేరుగా తిన‌లేరు. అలాంటి వారు వీటిని పెనంపై కాస్త వేయించాలి. త‌రువాత పొడి చేయాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో క‌ల‌పాలి. దీన్ని రాత్రి నిద్ర‌కు ముందు తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే పైన చెప్పిన విధంగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Post a Comment

0 Comments