Ads Area

త్రిఫలచూర్ణం ఉపయోగాలు

0

 త్రిఫలచూర్ణం ఉపయోగాలు



త్రిఫల చూర్ణం ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చూర్ణం ప్రతి రోజు తీసుకుంటే డాక్టరుతో పని ఉండదు.

 మనిషి ఆరోగ్యం, వాత, పిత్త, కఫ, లక్షణాలు పెాచ్చు  తగ్గులపైనే ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది.ఈ పెాచ్చు తగ్గులను సమతూకం చేయగలిగిన తిరుగులేని ఔషధమే త్రిఫల చూర్ణం.

 #కరక్కాయ, #తానికాయ, #ఉసిరికాయల మిశ్రమమే  త్రిఫల చూర్ణం.

 త్రిఫల చూర్ణంలో ఒక భాగం కరక్కాయ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి.

 కొంతమంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు. మార్కెటలోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహ చూర్ణం చేసి అమ్ముతున్నారు. విత్తనాలు కాకుండా పై పెచ్చులతో చేసిన త్రిఫలచూర్ణం ప్రభావవంతమైంది.

 ఇది సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలది.

 జబ్బులు ఉన్నా లేకపోయినా ఒక నెల పాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్ గా వాడి, మీ శరీరాన్ని గమనించండి. మీరు ఆశ్చర్య పోయే ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.

అంతేకాదు త్రిపల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది.

 అలాగే త్రిఫల చూర్ణం కంటిచూపును పెంచుతుంది. జీర్ణశక్తి,ని ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గుతుంది, వాతం నొప్పులు తగ్గుతాయి, చర్మ సమస్యలను, లివర్, ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

 ఉపయోగించే విధానం :

 ఉదయాన్నే పరిగడుపున అర గ్లాస్ గోరువెచ్చని నీటిలో చెంచా త్రిపల చూర్ణం వేసుకుని తాగాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కూడా తాగాలి.

 

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area