GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

 ఆరోగ్యమే మహా భాగ్యం



1. చెమటకాయలు రాకుండా ఉండాలంటే...

☛ వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో నీళ్లు బాగా తాగాలి.

☛ వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడం మంచిది.

☛ స్నానానికి రసాయనాలు ఎక్కువగా ఉన్న సబ్బులు వాడరాదు.

☛ పడుకునే గదిలో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి.

☛ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లగా, గాలి తగిలే ప్రాంతంలో ఉండాలి.

☛ చర్మం పొడిబారుతుందని ఎక్కువ క్రీమ్స్, ఆయిల్స్ వాడవద్దు.


2. గ్యాస్ట్రిక్ సమస్యకు ఆయుర్వేద చిట్కాలు : 

☛ ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని తాగాలి.

☛ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కచ్చాపచ్చాగా దంచి, ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. చల్లారాక వడగట్టి రాత్రి పూట తాగితే ప్రయోజనముంటుంది.

☛ కచ్చితమైన భోజన వేళలు పాటించాలి.


3. మునగాకు జ్యూస్‌తో ప్రయోజనాలు : 

మునక్కాయలే కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివి. మునగాకులో విట‌మిన్ ఎ, బి 2, బి6, ప్రొటీన్లు, ఐర‌న్‌, మెగ్నీషియం పుష్క‌లంగా ఉన్నాయి. దీన్ని జ్యూస్ చేసుకుని తాగితే ఎముకలకు బలం చేకూరుతుంది. షుగర్ అదుపులో ఉంటుంది. శరీర బరువు క్రమంగా తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. చర్మ, కంటి, మైగ్రేన్ సమస్యలు తగ్గుతాయి. మున‌గాకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణజాల పెరుగుదలను నివారిస్తాయి.


4. ఆముదం వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు :

● మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

● కళ్ల చుట్టూ నల్లని వలయాలను తగ్గిస్తుంది.

● జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

● చుండ్రును నివారిస్తుంది.

● మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

● వెన్నునొప్పి, కీళ్లనొప్పి, మోకాలు నొప్పులనుండి ఉపశమనం కలిగిస్తుంది.


5. నాడీ శుద్ధి ప్రాణాయామంతో ఒత్తిడికి చెక్ :

ప్రాణాయామ సాధనలో నాడీ శుద్ధి ముఖ్యమైనది, సులువైనది. మొదట ఒక ముక్కును మూసి, రెండో ముక్కుతో గాలిని పీల్చుకోవాలి. 5 సెకన్లు అలాగే ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకున్న ముక్కును మూసేసి, వేరే ముక్కుతో గాలిని వదలాలి. ఇలా పది నిమిషాలు చేయాలి. ప్రతిరోజూ శ్వాసను స్థంభించే సమయాన్ని పెంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు శక్తిమంతమవుతాయి. రక్తం శుభ్రపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

Post a Comment

0 Comments