GET MORE DETAILS

తెలుసుకుందాం

తెలుసుకుందాం



1) బ్రిస్క్ వాకింగ్ తెలుసా మీకు ? 

బ్రిస్క్‌ వాకింగ్ గురించి వైద్యులు తరచూ చెబుతుంటారు. బ్రిస్క్‌ వాకింగ్‌ అంటే.. వాకింగ్‌, రన్నింగ్‌కు మధ్యలో ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే వేగంగా నడవడం. ఇందులో మెల్లగా నడవడం, వేగంగా పరిగెత్తడం ఉండదు. దీనితో మెదడుకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. మెదడుకు ఆక్సిజన్‌తోపాటు ఇతర పోషకాలు ఎక్కువగా అంది ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది.

2) తెలుగు తిధులు :

☘ పాడ్యమి 

☘ విదియ 

☘ తదియ

☘ చవితి 

☘ పంచమి 

☘ షష్టి

☘ సప్తమి 

☘ అష్టమి 

☘ నవమి

☘ దశమి 

☘ ఏకాదశి 

☘ ద్వాదశి

☘ త్రయోదశి

☘ చతుర్ధశి

☘ పౌర్ణమి/అమావాస్య

3)  ఫోన్ పోయిందా ?

మీ ఫోన్ పోయిందా? లేదంటే ఎక్కడ పెట్టారో తెలియక కంగారు పడుతున్నారా? అయితే ఇలా చేయండి. మీ ఫోన్ లో రిజిస్టర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. గూగుల్ సెర్చ్ లోకి - వెళ్లి 'Where is my Phone' అని టైప్ చేయండి. అక్కడ గూగుల్ మ్యాప్ మీద బాక్స్ వస్తుంది. బాక్స్ లో లొకేట్ ఆప్షన్ ను ఓకే చేయండి. మ్యాప్ మీద మీ ఫోన్ ఉన్న లొకేషన్ కని పిస్తుంది. ఇప్పుడు ఎడమవైపు ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో రింగ్, లాక్, ఎరేస్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్ సైలెంట్ లో ఉన్నప్పటికీ ఐదు నిమిషాలు ఆగకుండా మోగుతుంది. లాక్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని కొత్త లాక్ సెట్ చేసుకోవచ్చు. ఎరేస్ ఆప్షన్ తో మీ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేయవచ్చు. దయచేసి ఈ నంబరుకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. నా ఫోన్ పోయింది' అంటూ మెసేజ్ కూడా పంపవచ్చు. ఇకపై ఫోన్ పోతే కంగారు పడకుండా ఈ ట్రిక్ ఫాలో అయిపోండి.

4) ఈ సామెతకు అర్థం తెలుసా ?

అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు. 

దుత్త అంటే కడవ. కోడలు అత్తగారి మీద కోపంతో, ఆవిడని ఏమీ అనలేక దుత్తని పగులగొట్టిందట. ఆవిధంగా ఆవిడపై కోపాన్ని తీర్చుకుంది. ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపించే సందర్భంలో ఈ సామెత వాడుతారు.

5) పసుపు కల్తీదో కాదో.. ఇలా చెక్ చేయండి :

మొదట గాజు గ్లాసు నిండుగా నీటిని తీసుకోండి. అందులో చెక్ చేయాలనుకునే పసుపును ఓ చెంచాడు వేయండి. కల్తీ జరిగితే.. నీళ్లు ముదురు పసుపు రంగులోకి మారతాయి. ఆ పసుపు కూడా నీటిలో చాలా వరకు కరిగిపోతుంది. అదే కల్తీ జరగని పసుపు అయితే గ్లాసు అడుగు భాగంలోకి చేరుతుంది. నీళ్లు కూడా లేత పసుపు రంగులోకి మారతాయి. ఇది ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగించే పద్ధతి.

Post a Comment

0 Comments