కేజీబీవీ ( కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు) లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహి స్తోన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతి ప్రవేశాలకు, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచా లకులుకె. వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 7వ తేదీ నుంచి 22 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే ప్రవేశాలకు పరిగణిస్తామని స్పష్టం చేశారు.
0 Comments