Ads Area

'హనుమాన్ చాలీసా' లో - "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు, నవనిధులు అంటే ఏమిటి...?

0

'హనుమాన్ చాలీసా' లో - "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు, నవనిధులు అంటే ఏమిటి...?



హనుమంతుడు తన భక్తులకు (భక్తిబలాన్ని అనుసరించి) అష్టసిద్ధులను, నవనిధులను అనుగ్రహిస్తాడు - అని తులసీదాసు తెలియ జేస్తున్నారు.

అష్టసిద్ధులు : 1. అణిమా, 2. మహిమ, 3. లఘిమ, 4. ప్రాప్తి, 5. ప్రాకామ్యము, 6. ఈశత్వం, 7. వశిత్వం, 8. సర్వ కామసిద్ధి ( కామావసాయిత్వము ). కొన్ని చోట్ల 'సర్వకామసిద్ధి' బదులుగా 'గరిమ' అని చెప్పబడింది.

'అణువు' లా సూక్ష్మరూపాన్ని పొందడం 'అణిమాసిద్ది'. అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం 'మహిమా సిద్ధి'. పరమాణువుల కంటే తేలిక కావడం 'లఘిమా సిద్ది'. గొప్ప బరువుగా మారగలగడం 'గరిమ'. ఇష్టపదార్థాలను పొందగలగడం 'ప్రాప్తిసిద్ది'.

లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం 'ప్రాకామ్యసిద్ధి'. అన్నిటిపై, అందరిపై అధికారాన్ని పొంది, తన ఇచ్ఛ మేరకు నడిపించడం 'ఈశత్వం'. దేవతలతో సహా తాను కోరిన వారిని వశం చేసుకొనడం 'వశిత్వం'. అన్ని కోరికలను పూర్తిగా తీర్చుకొనడం 'కామావసాయిత్వం'.

నవనిధులు : 1. పద్మం, 2. మహాపద్మం, 3. శంఖం, 4. మకరం, 5. కచ్ఛపం, 6. ముకుందం, 7. నీలం, 8. కుందం, 9. వరం. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ, జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area