GET MORE DETAILS

అద్భుతమైన పోషకాల ఈ జ్యూస్ లు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయగలవు.

అద్భుతమైన పోషకాల ఈ జ్యూస్ లు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయగలవు.



◆ సంతోషంగా జీవించాలి అంటే.. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు మైక్రో  న్యుట్రి ఎంట్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అన్నం,పప్పులు, నూనెలు, మాంసం,పండ్లు తింటున్నా పోషకారలోపంతో బాధపడేవారు వున్నారు.

◆ ఎన్నో అనారోగ్యాలకు కారణం ఈ పోషకాహార లోపం. విటమిన్లు, మినరల్స్ లోపాన్ని సరిచేయాలి అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్ లు తీసుకోవడం కంటే ఆహారంలో కొంచెం మార్పులు చేసుకుని కొద్దిగా మన జీవనశైలిని మార్చుకోవడం మంచిది.

◆ షుగర్, బీపీ, థైరాయిడ్, హార్మోనల్ ఇన్ బ్యాలన్స్, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు,బలహీనత, రక్తహీనత మొదలైన సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ క్రింది జ్యూస్ లు చాలా మంచి రిలీఫ్ ను ఇస్తాయి

◆ చిన్న ప్రయత్నంతో గొప్పమేలు చేసే కూరగాయలు, ఆకుకూరల రసాలతో పోషకాహార లోపాలకి, శారీరక సమస్యలకి చెక్ పెట్టొచ్చు.

◆ విటమిన్లు, మినరల్స్ తో పాటు అధిక ఫైబర్ ని అందించే కొన్ని అద్భుతమైన జ్యూస్ లు మీకోసం చెప్తున్నాము. 

1) ఆకు కూరల జ్యూస్ :

తయారీకి కావల్సిన పదార్థాలు :

పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులు,తేనె,నిమ్మచెక్క, మంచి  నీళ్లు. అన్ని ఆకులు కలిపి గుప్పెడు ఉంటే చాలు.

తయారీ విధానం :

ఈ ఆకులన్ని మిక్సీ పట్టాలి.తర్వాత నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఒక నిమ్మచెక్కని పిండి రుచికి తగినంత తేనె కలిపి నెమ్మదిగా తాగాలి.

2) కూరగాయల జ్యూస్ :

తయారీకి కావలసిన పదార్థాలు :

టమోటా, బీర, గుమ్మడి, కీర,సొర,పొట్లకాయ లతో పాటు జ్యూస్ కి అనువైన అన్ని కాయలను ఉపయోగించవచ్చు.

తయారీ విధానం :

కూరగాయలను ముక్కలుగా కోసి వాటిని మిక్సీలో వేసి అందులో తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసి ఒక నిమ్మచెక్కని అందులో పిండాలి.  రుచి కోసం కొద్దిగా తేనె ని కలపాలి.  ఈ జ్యూస్ ని కనీసం వారానికి ఒకసారి అయినా తీసుకోవాలి.

3) మునగాకు జ్యూస్ :

తయారీకి కావాల్సిన పదార్థాలు:

మునగాకు, కరివేపాకు, తేనె, నిమ్మ చెక్క, మంచి నీళ్ళు.

తయారీ విధానం :

ముందుగా ఆకుల్ని మిక్సీ పట్టాలి. దానికి తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసుకుని అందులో నిమ్మచెక్కని పిండి తేనె కలుపుకుని తాగాలి.

4) పాలకూర జ్యూస్ :

తయారికి కావాల్సిన పదార్థాలు :

పాలకూర, కరివేపాకు, తేనె, నిమ్మచెక్క మరియు మంచి నీళ్ళు.

తయారీ విధానం :

ఆకులను మిక్సీ పట్టి తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసి అందులో నిమ్మచెక్కని పిండి కొద్దిగా తేనె కలిపి తాగాలి.

5) గోధుమ గడ్డి జ్యూస్ :

ఎనిమిది రోజుల వయసున్న గోధుమ గడ్డిని ముక్కలుగా కత్తిరించుకుని  ఆ ముక్కల్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేయాలి. తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి వడగట్టాలి. ఈ జ్యూస్ ని ఉదయం అల్పాహారం కి అరగంట ముందు అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.

6) తవుడు జ్యూస్ : 

ఉదయం తాగాలి అంటే రాత్రి పూట 3 స్పూన్ల తవుడుని గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి. ఉదయం ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులోకి ఒక నిమ్మచెక్క పిండి కొద్దిగా తేనె కలిపి తాగాలి.

7) క్యారెట్, బీట్రూట్ జ్యూస్ :

బీట్రూట్, క్యారెట్ ముక్కలకు కొన్ని నీళ్లు కలిపి మిక్సీ పట్టి  అందులో ఒక నిమ్మచెక్కని పిండి కొంచెం తేనెను కలిపి త్రాగాలి. షుగర్ ఉన్నవారు  పై జ్యూస్ లు తాగాలి అనుకుంటే తేనె కలుపుకోకుండా తీసుకోవాలి.

Post a Comment

0 Comments