GET MORE DETAILS

ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయి.

 ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయి.




ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయి (72) నియమితులు కానున్నారు.                

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలతో కూడిన ఎంపిక సంఘం ఆమె పేరును సిఫార్సు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.                

దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.                

గతంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆమె ఇటీవల వరకు జమ్మూ-కశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు.

ఇంతకుముందు వరకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన జస్టిస్‌ చంద్రమౌళి కుమార్‌ ప్రసాద్‌ పదవీ కాలం నిరుడు నవంబరులోనే ముగిసింది.అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.

Post a Comment

0 Comments