GET MORE DETAILS

పేదరికంలో చిక్కుకోకుండా ఉండాలంటే మనిషి ఏమి చేయాలి...?

పేదరికంలో చిక్కుకోకుండా ఉండాలంటే మనిషి ఏమి చేయాలి...?



ఆచార్య చాణక్య మనిషి తన జీవితాన్ని మరింత మెరుగ్గా గడిపేందుకు అవసరమైన పలు విషయాలను వివరించాడు. వాటిలో పేదరికంలో చిక్కుకోకుండా ఉండాలంటే మనిషి ఏమి చేయాలో కూడా తెలిపాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

భగవంతుని దయతో మీకు చాలా సంపద లభించినప్పటికీ దానిని వృథాగా ఖర్చు చేయకండి. అవసరానికి మించి విపరీతంగా ఖర్చు చేసే వ్యక్తులు కష్టాల్లో పడతారు. తమను తాము ఇబ్బందుల్లోకి నెట్టేసుకున్నవారవుతారు. ఆర్థిక సంక్షోభం వారిని చుట్టుముడుతుంది. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. 

అవసరానికి అనుగుణంగా డబ్బను ఖర్చు చేయాలి. శుభకార్యాలకు, సంక్షేమ పనులకు డబ్బును వినియోగించాలి.  

అలాగే డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా దాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నించండి. సాంగత్యం అనేది ఒక వ్యక్తిపై చాలా వేగంగా ప్రభావం చూపుతుంది. మీ సాంగత్యం బాగా లేకపోతే మీరు దిగజారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. తప్పుడుదారి పట్టించేవారితో తిరిగితే విలువైన డబ్బును కోల్పోవడమే కాకుండా అనేక ఇబ్బందుల బారిన పడతారు. 

కొందరు అబద్ధాలు చెప్పి  స్వార్థం కోసం దేనికైనా సిద్ధపడతాడు. ఇటువంటివారు ఎవరి నమ్మకాన్నీ పొందలేడు. అలాంటివారు తమ చెడు అలవాట్ల కారణంగా జీవితంలో లభించే మంచి అవకాశాలను సైతం కోల్పోతారు. 

ఇతరులను మోసం చేసే వారు తమ జీవితంలో ఘోరంగా మోసపోతారు. మోసం చేసి డబ్బు సంపాదించినా అది సద్వినియోగం కాదు. ఇటువంటి పనులకు తిరిగి మూల్యం చెల్లించుకోక తప్పదు. 

నిరుపేదలను, వృద్ధులను అవమానించే వారిపై దైవం అనుగ్రహం ఉండదు. అలాంటి వారి వద్ద డబ్బు ఉన్నా అది దుర్వినియోగం అవుతుంది.

Post a Comment

0 Comments