GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

 ఆరోగ్యమే మహా భాగ్యం



1) ఉదయం ఈ 'టీ'లు ట్రై చేయండి :

● లెమన్‌ టీ- దగ్గు, జలుబు, ఉబ్బరం, అజీర్తిలను పోగొడుతుంది లెమన్‌ టీ. వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి ఈ టీ తయారు చేసుకోవచ్చు.

● జింజర్‌ టీ- జీర్ణ సమస్యలు, నెలసరి నొప్పులు, గొంతు నొప్పులకు విరుగుడు జింజర్‌ టీ. అల్లం తరుగు నీళ్లలో వేసి, చిన్న మంట మీద మరిగించి ఈ టీ చేసుకోవచ్చు.

● టర్మరిక్‌ టీ: శరీరాన్ని శుద్ధి చేసే గుణం పసుపు టీకి ఉంటుంది. మరిగే నీటిలో బ్లాక్‌ టీ ఆకులు, పసుపు కలిపి తయారు చేసుకోవాలి.

2) పగటి నిద్ర గురించి మీకు తెలుసా...?

చాలామంది రాత్రివేళ మిస్సయిన నిద్రను.. పగటి వేళ భర్తీ చేద్దాం అని అనుకుంటారు. కానీ, దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదట. శరీరం రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం వేళల్లో చురుగ్గా ఉంటుందని, పగటి వేళ బలవంతంగా విశ్రాంతి ఇవ్వడం వల్ల ఫలితం ఉండదని చెబుతున్నారు సైంటిస్టులు. కొన్ని అధ్యయనాల ప్రకారం పగటి వేళ నిద్రపోవడం, నిద్రలేమి సమస్యల వల్ల ఎక్కువ మంది టైప్-2 డయాబెటీస్‌‌కు గురవుతున్నారు.

3) ఆయుర్వేద చిట్కా: జలుబు తగ్గించే మార్గాలు : 

⊙ ఒక కప్పు పాలలో చెంచా పసుపు కలిపి తీసుకుంటే జలుబు, పడిశం తగ్గుతాయి. 

⊙ ఒక గ్లాసు పైనాపిల్ రసంలో మిరియాలపొడి, ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు కంట్రోల్ అవుతుంది. 

⊙ తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. 

⊙ మిరియాలపొడి, పెరుగును కలిపి తింటే జలుబు పరార్ అవుతుంది. 

⊙ జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. 

⊙ వామాకు దంచి దానిలో కాస్తా కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి.

4) కిడ్నీలో రాళ్లు తగ్గించే ఇంటి చిట్కాలు :

కిడ్నీలో స్టోన్స్‌ కరిగించడానికి ఇంటి చిట్కాలు పాటించండి.

● నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తాగండి. వెంటనే గ్లాసు నీళ్లు కూడా తాగేయండి. 

● 2 వారాల పాటు రోజుకు ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. 

● పరగడుపున దానిమ్మ రసం తీసుకోండి. 

● రోజుకు మూడు గ్లాసుల చొప్పున క్రాన్‌బెర్రీ రసం తాగాలి. 

● రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు రాకుండా ఉంటాయి. 

● వైద్యుల చికిత్సలతో పాటు ఈ చిట్కాలను కూడా పాటించవచ్చు.

5) ఆయుర్వేద చిట్కా: మెంతులతో మ్యాజిక్ :

మెంతులను ఆయుర్వేదంలో విరివిగా వినియోగిస్తారు. వీటికి రోగాల్ని నయం చేసే గుణాలున్నాయి. కడుపులో పురుగుల్ని, క్రిములను చంపేస్తాయి. దగ్గు, జ్వరం, జాండిస్, కంటి సమస్యలకు చెక్ పెడతాయి. మెంతులను నాన బెట్టిన నీటిని తాగడం, మెంతులు నమలడం, వంటల్లో వేసుకోవడం, పచ్చళ్లలో వేసుకోవడం ఇలా ఎలా మెంతులను వాడినా... అవి బాడీలో చెడు కొవ్వును కరిగిస్తాయి. వీటిని 15రోజులు రెగ్యులర్‌గా వాడితే వెన్నునొప్పి తగ్గుతుంది.

Post a Comment

0 Comments