GET MORE DETAILS

తిరుమలలో అంగప్రదిక్షణ - స్వామి వారి సన్నిధిలో అంగప్రదిక్షణ చేయడం అంటే ఆ అనుభూతి వేరు.

తిరుమలలో అంగప్రదిక్షణ - స్వామి వారి సన్నిధిలో అంగప్రదిక్షణ చేయడం అంటే ఆ అనుభూతి వేరు.





తిరుమల శ్రీవారి ఆలయం లో పలు రకాల ప్రదక్షణలు  ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి...

💥 మహా ప్రదక్షిణం 

💥 సంపంగి ప్రదక్షణం 

💥 విమానప్రదక్షణ 

💥 అంగప్రదక్షిణ...

వీటిలో శ్రీవారికి అత్యంత ఇష్టమైన ప్రదక్షిణలు రెండు అవి...

1. మహా ప్రదక్షిణం.

2. అంగప్రదక్షిణ.

అంగప్రదక్షిణ లేదా పొర్లుదండాలు అనేది శ్రీవారి సేవలలో మరియు దర్శన పద్ధతులలో ఒక పద్ధతి.

సాష్టాంగపడి స్వామి ఆలయంలో పొర్లు దండాలు పెట్టి మన సమస్యలు, కృతజ్ఞతలు శ్రీవారికి నివేదించుకునే ఒక శరణాగతి పద్ధతి. ఈ శరణాగతి పద్ధతిని అంగప్రదక్షిణ లేదా పొర్లుదండాలు అంటారు. స్త్రీ పురుషులు ఇందులో పాల్గొనవచ్చు. ప్రస్తుతం అంగప్రదక్షిణ టికెట్లు ఆన్ లైన్ ద్వారా రోజుకు 750 చొప్పున ఆ నెలకు సంబంధించిన టికెట్లు ఆన్లైన్ లోనే విడుదల చేస్తున్నారు.

📌 గతంలో మాదిరి నేరుగా అంగప్రదక్షిణ టికెట్లు తిరుమలలో ఇవ్వడం లేదు. భక్తులు ఈ విషయం గమనించగలరు.

అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలు తో రాత్రి సుమారు 12 గంటల సమయంలో సుపథం మార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర లైన్ లో నిలబడి ఈ అంగప్రదక్షిణ సేవకు గుడిలో కి వెళ్ళవలసి ఉంటుంది.

📌 ఆడవాళ్లు చీర లేదా పంజాబీ డ్రెస్సు వేసుకోవచ్చును.

📌 మగవాళ్ళు పంచ లేదా ప్యాంట్ వేసుకోవాలి. మగవారికి పైన షర్ట్ ఉండకూడదు.

★ వేరు వేరు లైన్లలో వీరిని సేవకు పంపుతారు ముందుగా ఆడవాళ్ళు పొర్లుదండాలు పెట్టి బయటకు వచ్చిన తరువాత మగవాళ్ళ అంగ ప్రదక్షిణ మొదలు అవుతుంది కావున ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

★ తిరుమల శ్రీవారికి మహిమాన్వితమైన సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు ఈ అంగప్రదక్షిణ సేవ గర్భాలయానికి బయట శ్రీవారి బంగారు బావి నుండి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది.

★ సుప్రభాత సేవ అ జరిగిన వెంటనే లోపల తోమాలసేవ జరుగుతున్న సమయంలో అంగప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్త్రీ పురుషులను వేరు వేరు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. 

★ స్వామికి అంగ ప్రదక్షణ చేసి, స్వామిని మనసారా దర్శించుకుని బయటకు వచ్చేటప్పటికి ఉదయం 5 అవుతుంది. బయటకు వచ్చి ప్రశాంతంగా  గుడి ఎదురుగా ఒక చోట కూర్చుని కాసేపు ధ్యానం చేయండి.

మీకు అంతా శుభం జరుగుతుంది

       ఓం నమో వెంకటేశాయ

 అంగప్రదక్షిణ ప్రియ గోవిందా గోవిందా


 

Post a Comment

0 Comments