GET MORE DETAILS

తిరుపతికి మరో ప్రముఖ కేంద్ర విద్యా సంస్థ

 తిరుపతికి మరో ప్రముఖ కేంద్ర విద్యా సంస్థ



● నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటి) ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్రం

● పలుమార్లు కేంద్ర, రాష్ట్ర అధికారులకు ఎన్ఐఇఎల్ఐటి నెలకొల్పమని విన్నవించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి.

ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటి) దేశం మొత్తంలో 47 కేంద్రాలను కలిగి ఉందని ఇది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న స్వయం ప్రతిపత్తమైన శాస్త్రీయ సంఘం అని ఆయన చెప్పారు. ఎన్ఐఇఎల్ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కెపాసిటీ బిల్డింగ్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తుందని, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, హార్డ్వేర్, సైబర్ చట్టం, సైబర్ భద్రతా, భౌగోళిక సమాచార వ్యవస్థ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ & మ్యానుఫ్యాక్చరింగ్, ఇ-వ్యర్థాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఇ-గవర్నెన్స్ వంటి ఫార్మల్ మరియు నాన్-ఫార్మల్ రంగాలలో కోర్సులను అందిస్తుందని ఇది జాతీయ పరీక్షా సంస్థలలో ఒకటని ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయి విద్య, శిక్షణ మరియు గుర్తింపు సేవలను అందించడం ద్వారా నాణ్యమైన మానవశక్తిని సృష్టించడం, సమాచార, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐఇసిటి) మరియు అనుబంధ రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణులను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం అన్నారు. 

తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ఎన్ఐఇఎల్ఐటి తిరుపతిలో నెలకొల్పడం ద్వారా ఐసిఇటి ద్వారా వృద్ధి చేయబడిన ప్రత్యేక పాఠ్య ప్రణాళిక క్రియాశీల రూపకల్పన, అభివృద్ధి మరియు కంటెంట్ పొందడం ద్వారా అభ్యాసకులకు, శిక్షకులకు నిరంతర మద్దతును అందించడం మరియు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఎస్సి, ఎస్టీ విద్యార్థులు కూడా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క వివిధ పథకాల క్రింద శిక్షణను ఉచితంగా అందించడం ద్వారా  వారికి  ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.

ఎన్ఐఇఎల్ఐటి స్థాపనకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కలిసి కృషి చేశామని చెప్పారు. తిరుపతి మునిసిపల్ పరిధిలో అనువైన, అవసరమైన స్థలాన్ని కేటాయిస్తే ఎన్ఐఇఎల్ఐటి ఏర్పాటుకు సిద్ధమని తెలియజేసారని ఆయన చెప్పారు. ఎన్ఐఇఎల్ఐటి నెలకొల్పేందుకు సుమారు 8000 నుండి 10000 చ.అ భూమి  అవసరమవుతుందని అధికారులు చెప్పారని ఆయన అన్నారు. తదుపరి ఈ విషయమై శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు ఇతర అధికారులతో చర్చించగా  ఇదివరకే నిర్మించిన  భవనం అందుబాటులో ఉందని ఎన్ఐఇఎల్ఐటి అధికారులు పరిశీలించిన పిదప తగిన చర్యలు తీసుకొని త్వరలో ఏర్పాటుకు మార్గం సుగమమయ్యేలా చేస్తామని ఎన్ఐఇఎల్ఐటి ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారికి తిరుపతి ఎంపీ గురుమూర్తి ధన్యవాదాలు తెలియజేసారు.

Post a Comment

0 Comments