GET MORE DETAILS

ఏది నిజమైన పూజ..?

 ఏది నిజమైన పూజ..?



భగవంతుని కి భక్తితో చేసినపూజే నిజమైన పూజ. భక్తి అనే పదం ఇక్కడ గమనించదగ్గది, ఇతరులకు చూపటానికి గానీ, ప్రచారం పొందటానికి గానీ , పూజ చేయకూడదు...


మనం చేసే పూజ వలన మంచి కలగాలని పూజించాలి. లోకా సమస్త సుఖినోభవంతు అనే ప్రార్థన ఉండాలి,


కొందరు పూజకన్నా సంకల్పానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, సంకల్పం కన్నా మనం చేసే పూజలో శ్రద్దా , భక్తి ఉండాలి. ఈశ్వరుడికి తెలుసు మన మంచి, చెడు రెండు...


కుచేలుడు శ్రీకృష్ణపరమాత్మను కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు తనకు ఏదైనా కావాలని అడగలేదు.


శ్రీ కృష్ణుడిని ఆనందపరచటానికి గుప్పెడు అటుకులు మాత్రమే ఇచ్చాడు.


శ్రీకృష్ణుడు కూడా ప్రేమతో ఇచ్చిన అటుకులను స్వీకరించి మూడు నిమిషాలలో కుచేలుడిని కుబేరుడిని చేసాడు.


కాబట్టి మనం ఈశ్వరుడిని ఏమి అడగక్కర్లేదు అని చెప్పటానికి ఇదొక నిదర్శనం.


కాబట్టి మనం ఏపని చేసినా ఈశ్వరకృప కలగాలని చేయాలి గానీ ప్రచారంకోసంకాదు.


భక్తితో పది నిమిషాలు పూజించినా చాలు , గంటలకొద్దీ కూర్చుని మనస్సంతా వేరే ఆలోచనలు పెట్టుకుని పూజించనక్కరలేదు.


పూజించే సమయం తక్కువైనా అది భక్తితో చేస్తేనే, పుణ్యం లభిస్తుంది, భగవంతునికి చేరువ అవుతాము.

Post a Comment

0 Comments