GET MORE DETAILS

పూజ - పరమార్థాలు

 పూజ - పరమార్థాలు



🕉️ పూజ – పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది.


🕉️ అర్చన – అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.


🕉️ జపం – అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.


🕉️ స్తోత్రం – నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


🕉️ ధ్యానం – ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది. ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.


🕉️ దీక్ష –.దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.


🕉️ అభిషేకం – అహంభావాన్ని పోగొట్టేది. భయాన్ని మథించేది. పవిత్రోదకాన్నిచల్లేది. ఆనందాదులను కల్గించేది.


🕉️ మంత్రం –> తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.


🕉️ ఆసనం –> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


🕉️ తర్పణం – పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


🕉️ గంధం – అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది. ధర్మఙ్ఞానాలనిచ్చేది.


🕉️ అక్షతలు – కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.


🕉️ పుష్పం – పుణ్యాన్ని వృద్ధిచేసే. , పాపాన్ని పోగొట్టేది. పుష్కలార్ధాన్ని ఇచ్చేది.


🕉️ ధూపం – చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది.


🕉️ దీపం – సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.


🕉️ నైవేద్యం – ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్థాలను, దేవతకు తృప్తినిచ్చే దానిని నివేదన చేయుటయే.


🕉️ ప్రసాదం – ప్రకాశానందాల నిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.


🕉️ ఆచమనీయం – లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .


🕉️ ఆవాహనం – పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.


🕉️ స్వాగతం – దేవతను కుశలప్రశ్నవేయుట.


🕉️ పాద్యం – చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.


🕉️ మధుపర్కం – తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.


🕉️ స్నానం – గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.


🕉️ వందనం – అష్టాంగాలతో కూడిన నమస్కారం (వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).


🕉️ ఉద్వాసన – దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.

Post a Comment

0 Comments