GET MORE DETAILS

భారతదేశపు రూపాయి ఏ సంవత్సరంలో అమెరికన్ డాలర్ విలువతో సమానంగా వుండేది ?

భారతదేశపు రూపాయి ఏ సంవత్సరంలో అమెరికన్ డాలర్ విలువతో సమానంగా వుండేది ?



(1) పూర్వకాలములో నాణేలరూపంలో లేదా బంగారు వెండి రూపంలో సొత్తును తీసుకు వెళ్ళాలంటే వర్తకులకు చాలా ఇబ్బందిగా వుండేది. మొదటి కారణం బరువు కాగా రెండోకారణం దొంగలభయం, ఎందుకంటే పెద్ద మొత్తములో ధనం దాచివుంచడానికి ఎక్కువగా బోషాణాలు, తగినంతగా స్థలం  అవసరమయ్యేది, అంతేకాకుండా ఎక్కడ దాచి వుంచేవారో దొంగలకు తెలిసిపోయేది. ఈ బాధలు తీరటానికే చైనాదేశంలో 7వ శతాబ్దంలో  పేపరు కరెన్సీని మొదటగా  టాంగ్ (Tang) వంశపురాజులు ప్రవేశపెట్టారు. కాని ఈ పద్ధతి పెద్దగా ప్రచారంలోనికి రాలేదు.11వ శతాబ్దంనుండి చైనాలో విరివిగా పేపరు కరెన్సీ అమలులోనికి వచ్చింది. సో పేపరు కరెన్సీని మొదటగా ప్రవేశపెట్టినవారు చైనీయులన్నమాట.

(2)  ద్రవ్యరూపంగా నాణేలు  5000 BCE కాలంలో మానవులు వాడడం జరిగింది. ఆ నాణేలకు ఇప్పటిలా ఒక స్థిరరూపంలో కాని ఒకే విలువకాని వుండేది కాదు. ప్రాంతానికి మరోప్రాంతానికి అస్పష్టమైన విలువలు ఆకారాలు వుండేవి. అస్పష్టమైన నాణేలను ఉద్దంక (Punch marked) నాణేలని అనేవారు.

(3) రుపాయి / రుపయ/ రుపయే అనేది భారతదేశపు కరెన్సీకి వున్న అధికారపూర్వకమైన పదం. రుపాయిని మొట్టమొదటి సారిగా డిల్లీరాజు షేర్ షా సూరి (1540 - 45) లో ప్రవేశపెట్టాడు. వీమా కాడ్పైసిస్ అనే  కుషాన వంశపురాజు మొదటిసారిగా బంగారునాణేలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు.

(4) ఆంగ్లోభారతప్రభుత్వం 1861 లో మొదటిసారిగా 10 రూపాయల కరెన్సీ నోట్లను భారతదేశంలో ముద్రించింది. అంతకు మునుపు నోట్లను ఇంగ్లాండ్ లో ముద్రించి భారతదేశానికి తీసుకురావడం జరిగేది.

(5) ఇంపిరియల్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Imperial Bank of India) అనేపేరు నేటి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పూర్వరూపము. 1938 లో ఆంగ్లోభారతప్రభుత్వం కాకుండా ఇంపిరియల్‌ బ్యాంక్ ఆఫ్  ఇండియా మొదటగా 5 రుపాయల నోట్లను ముద్రించింది.

(6) స్వతంత్ర్యభారతదేశంలో రిజర్వు బ్యాంక్  ఆఫ్ ఇండియా ద్వారా 1950లో మొదటిసారిగా 2,5, 10, 100 రూపాయల నోట్లను  ముద్రించడం జరిగింది. నాణేల ముద్రణ పూర్తిగా భారతప్రభుత్వ ఆధ్వర్యములోనే జరుగుతుంది. అలాగే... ఒక రూపాయి నోటుముద్రణ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా భారతఆర్థికశాఖ ఆధ్వర్యములోనే జరుగుతుంది.

(7) 15 ఆగస్ట్ 1947 లో భారతరుపాయి విలువ ఒక అమెరికన్  డాలర్ తో సమానంగా వుండేది.

(8) భారతకరెన్సీపై  మొదటిసారిగా గాంధీజీ బొమ్మ 1969 లో ముద్రించడము జరిగింది. 100 రూపాయలనోటుపై గాంధీజీ  సేవాగ్రాం ఆశ్రమములో కూర్చుని వున్నట్లుగా దానిని ముద్రించడం జరిగింది. కాని నిరంతరంగా (కంటిన్యూయస్లీ) భారతకరెన్సీపై ఇప్పుడున్న విధంగా గాంధీజీ బొమ్మను ముద్రించడము 1987 లో మొదలైంది. 1987 లో 500 రుపాయల నోటుపై ఇప్పుడున్న విధంగా గాంధీజీ బొమ్మను ముద్రించడం జరిగింది.

(9) 1946 లో అత్యధికమొత్తాలైన ( హై డినామినేషన్) నోట్లను నిషేధించగా, 1953 లో మరలా 1000, 5000, 10000 నోట్లను ముద్రించి ప్రవేశపెట్టడం జరిగింది.

1978 లో మొరార్జిదేశాయ్ ప్రభుత్వం తిరిగి ఈ హై డినామినేషన్ నోట్లను రద్దుపరచడం జరిగింది.

(10) 1987 లో మొదటిసారిగా 1000 రూపాయల నోటును ప్రవేశపెట్టడము జరిగింది.

2000 సంవత్సరం నుండి 25 పైసలు (పావలా), 20 పైసలు, 10 పైసలు, 5,3,2,1 పైసలను చలామణినుండి తొలగించారు. స్వాతంత్ర్యము రాకముందు భారతదేశములో బొట్టు, అర్ధణా, ఆణా, రెండాణాలు, పావల, అర్ధరుపాయి, రూపాయి బిళ్ళలు (నాణేములు) అమలులో వుండేవి.

(11) 8 నవంబరు 2016 లో భారతప్రభుత్వము 500, 1000 నోట్లను చలామణినుండి ఉపసంహారించింది. అలాగే 2016 లో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది.

(12) 1956 లో దశాంశపద్ధతిలో అనగా 1,2,3,5, 10, 20, 25, 50, 100  నాణేలను ప్రవేశపెట్టడం జరిగింది.

Post a Comment

0 Comments