GET MORE DETAILS

నాగు పాముల విషం కాలక్రమేణా మణిగా మారుతుందని చెబుతారు, నిజమేనా ?

నాగు పాముల విషం కాలక్రమేణా మణిగా మారుతుందని చెబుతారు, నిజమేనా ?పాములు మణులను సృష్టించలేవు. నాగమణులంటూ ఎక్కడా లేవు. పాములు విషం గట్టిపడి అదే మణిగా మారుతుందనడం కూడా నిజం కాదు. పాములకు సంబంధించినన్ని మూఢనమ్మకాలు ఇన్నీ అన్నీ కావు. పాములు పగపడతాయని అనుకుంటారు. అది తప్పు. పాములు నాగస్వరాన్ని వింటూ ఆడతాయంటారు. ఇదీ నిజం కాదు. పాములకు చెవులు లేవు. పాములు పాలు తాగడం కూడా నిజం కాదు. అలాగే జర్రిపోతు మగపామే కానక్కర లేదు. అలాగే పాములన్నీ విషపూరితం కూడా కావు.

Post a Comment

0 Comments