పిల్లల్లో ఇమ్మ్యూనిటి పెరిగేందుకు చేయవలసినవి
పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే...
■ కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2(రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి.
■ ఆకుకూరలు, మునగకాయలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తో పాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి.
■ పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.
■ కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.
■ పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ పసుపు ఆహారంలో ఇవ్వడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.
■ బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించాలి. మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
■ పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి.
■ పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి.
0 Comments