GET MORE DETAILS

ఆగస్ట్ నెల ప్రాముఖ్యత : ముఖ్యమైన దినోత్సవాలు

ఆగస్ట్ నెల ప్రాముఖ్యత : ముఖ్యమైన దినోత్సవాలు



ఆంగ్ల సంవత్సరంలోని  ఎనిమిదవ నెల  ఆగస్టు. ఈ నెలకు 31 రోజులు. మొదట్లో ఈ నెలను సిక్స్ టిల్లాస్ అని పిలిచేవారు.  ఆనాటి పాత రోమన్ పంచాంగంలో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో సంవత్సరంలో "మార్చి" మొదటి నెలగా ఉండేది. సంవత్సరానికి మొత్తం పది నెలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౭౦౦ (700) నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం 29 రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. 45 వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు 31 రోజులు వచ్చాయి. సా.శ.పూ. 8 వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.

జూలియస్ మనవడు అగస్టస్ - మార్క్ ఆంటోనీ, క్లియోపాత్రాలను ఓడించి, రోమ్ చక్రవర్తి అయిన తరువాత, రోమన్ సెనేట్ అతనిపేరు ఒకనెలకు పెట్టాలని నిర్ణయించుకుంది. అగస్టస్ కోసం సిక్స్ టిల్లస్ (సిక్స్ = ఆరు) నెల ఎంపిక చేయబడింది.

అగస్టస్ గా పేరు మార్చిన ఒక నెల తరువాత సెనేట్ పేరు పెట్టడమే కాకుండా, జూలైనెలకు (జూలియస్) 31 రోజులు ఉన్నందున, అగస్టస్ నెలకు కూడా సమానంగా 31 రోజులు ఉండాలని నిర్ణయించింది. దానిప్రకారం జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలకు 31 రోజులు నిడివికి మారింది.

ఈ మార్పుకు అనుగుణంగా మరో రెండు క్యాలెండర్ సర్దుబాట్లు అవసరం ఏర్పడింది. ఆగస్టు ప్రాముఖ్యతను పెంచడానికి అవసరమైన అదనపు రోజు, ఫిబ్రవరి నెల నుండి తీసుకోబడింది. ఇది మొదట 29 రోజులు (లీపు సంవత్సరంలో 30) కలిగి ఉంది. ఇప్పుడు దీనిని 28 రోజులకు తగ్గించారు. (లీపు సంవత్సరంలో 29 రోజులు).

ఆగస్టు నెలలో కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు :

★ ఆగస్టు 1 - అంతర్జాతీయ పర్వత దినోత్సవం.

★ ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం.

★ ఆగస్టు 4 - యు.ఎస్. కోస్ట్ గార్డ్ డే.

★ ఆగస్టు 6 - హిరోషిమా డే.

★ ఆగస్టు మొదటి శుక్రవారం అంతర్జాతీయ బీర్ దినోత్సవం.

★ ఆగస్టు 9 - క్విట్ ఇండియా డే , నాగసాకి డే , ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం.

★ ఆగస్టు 12 - అంతర్జాతీయ యువ దినోత్సవం.

★ ఆగస్టు 13 - ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం.

★ ఆగస్టు 14 - పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం.

★ ఆగస్టు 15 - భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం.

★ ఆగస్టు 15 - బంగ్లాదేశ్ జాతీయ సంతాప దినం.

★ ఆగస్టు 16  - బెన్నింగ్టన్ యుద్ధ దినం.

★ ఆగస్టు 17 - ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం.

★ ఆగస్టు 19  - ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం , ప్రపంచ మానవతా దినోత్సవం.

★ ఆగస్టు 20 - ప్రపంచ దోమల దినోత్సవం , సద్భావానా దినోత్సంవం.

★ ఆగస్టు 23 - బానిస వాణిజ్య నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం.

★ ఆగస్టు 26 - మహిళా సమానత్వ దినం.

★ ఆగస్టు 29 - జాతీయ క్రీడా దినోత్సవం.

★ ఆగస్టు 30 - చిన్న పరిశ్రమల దినోత్సవం.




Post a Comment

0 Comments