మోకాలు మరియు కీళ్ల నొప్పుల ఉపశమనం - చిట్కాలు
ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సహజంగానే ఎప్పటికప్పుడు నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో వారు నొప్పితో బాధకు విలవిలలాడుతుంటారు. ఆర్థరైటిస్‌లో నిజానికి పలు రకాలు ఉన్నప్పటికీ కొన్నింటిలో మోకాళ్ళ నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటించడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
1. అలొవెరా (కలబంద) అలొవెరాలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని నేరుగా సంబంధిత ప్రదేశంలో రాయాలి. ఈ క్రమంలో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కొంత కడుపులోకి తీసుకుంటే మంచిది.
2. శల్లకి అనే వృక్షానికి చెందిన జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇందులోనూ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీన్ని తెలుగులో , గుగ్గిలం అని పిలుస్తారు. దీని జిగురును నిత్యం 1 గ్రాము మోతాదులో తీసుకోవచ్చు. దీని వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శల్లకి మనకు మార్కెట్‌లో ట్యాబ్లెట్లు, క్రీముల రూపంలోనూ లభిస్తుంది.
3. నీలగిరి ఆకుల తైలాన్ని 15 చుక్కల మోతాదులో తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్ల బాదం నూనె కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. అయితే నీలగిరి ఆకుల తైలం కొందరికి పడదు. అందుకు గాను వారు ముందుగా దాంతో టెస్ట్ చేయాలి. కొద్దిగా ఆయిల్‌ను తీసుకుని ముంజేయిపై రాసి 24 నుంచి 48 గంటల పాటు వేచి ఉండాలి. ఎలాంటి రియాక్షన్ లేకపోతే నిరభ్యంతరంగా ఆ నూనెను వాడుకోవచ్చు. దీంతో కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
4. అల్లం రసంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అల్లం రసాన్ని తాగినా, దాంతో కషాయం చేసుకుని తాగినా లేదా నేరుగా అల్లాన్ని తీసుకున్నా నొప్పులు తగ్గుతాయి.
5. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. అందువల్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ ట్యాబ్లెట్లు కూడా మనకు లభిస్తాయి. వాటిని వైద్యుల సూచన మేరకు వాడుకోవచ్చు.
6. పసుపు కీళ్ల నొప్పులకు ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. పసుపుతో తయారు చేసే డికాషన్‌ను లేదా ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల, నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా పసుపు, నీరు మిశ్రమంతో మర్దనా చేయడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందది
0 Comments