GET MORE DETAILS

ఆరోగ్యమే మహాభాగ్యము : జామ ఆకులు

 ఆరోగ్యమే మహాభాగ్యము : జామ ఆకులు సామాన్యుల నుండి నిరుపేదల పండు. అతి తక్కువ ఖర్చులో దొరికే మంచి పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న పండు. పండుతో పాటు జామ ఆకులు కూడా అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. జామ ఆకుల టీ క్యాన్సర్ తో పోరాడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. కొలెస్ట్రాల్ ను సైతం ఈ ఆకులు తగ్గిస్తాయి. తగ్గిస్తుంది మరియు మధుమేహానికి చికిత్స చేస్తుంది.జామ ఆకు టీ బలమైన యాంటీ బాక్టీరియల్ చర్యలను అందిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే, సాధారణ జలుబు మరియు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సాంప్రదాయ ఔషధం ఎండిన ఆకులను ఉపయోగిస్తుంది. ఇంకా, ఇది డెంగ్యూ వైరస్ సంక్రమణ వంటి క్లిష్ట పరిస్థితికి సహాయపడుతుంది.

జామ ఆకుల యొక్క శోథ నిరోధక లక్షణాలు పంటి నొప్పిని పరిష్కరిస్తాయి. మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. పంటి నొప్పిని తగ్గించుకునేందుకు లేత జామ ఆకులను నోట్లు వేసుకుని నమలాలి. ఎందుకంటే వాటిని చూర్ణం చేయడం వల్ల వాటి వాపు నిరోధక లక్షణాలు ఏర్పడతాయి. ఇంకా జామాకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. స్త్రీ లలో రుతుస్రావం యొక్క నొప్పిని తగ్గించడానికి జామ ఆకులు చాలా బాగా పని చేస్తాయి. జామ చెట్టు లేత ఆకులు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. చిన్నప్పుడు చాలా మంది ఈ లేత ఆకుల్లో చింత పండు పెట్టుకుని తినడం గుర్తుండే ఉంటుంది. ఈ ఆకు వల్ల లాభాలు మనకు అప్పుడు తెలియక పోయినా… అలా ఈ జామ లేత ఆకులను తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

జామ ఆకులను తరచూ తినడం వల్లే అనే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె పని తీరుపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.ఈ ఒక్క ఆకుతో వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే చాలా మంది ఈ ఆకులను నోట్లో వేసుకుని నమలడం ఇష్టం ఉండదు. లేదా ఇంట్లో జామ చెట్టు ఉండదు. కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే ఈ ఆకులు దొరుకుతాయి. అలాంటి వారు ముదురు జామ ఆకులను తీసుకుని వాటిని నీడలో ఆరనివ్వాలి. ఆకు పూర్తిగా ఎండిపోయాక… దానిని చూర్ణం చేసి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్నా మంచి ప్రయోజనాలే కలుగుతాయి. ఇలా నీళ్లల్లో కలుపుకుని తాగలేని వారు.. ఆ చుర్ణాన్ని చిన్న చిన్న గోళీల మాదిరిగా తయారు చేసుకుని మింగేయ్యాలి. అది లోపలికి వెళ్లాక అది ప్రభావాన్ని చూపడం మొదలు పెడుతుంది

బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుండే జామకాయలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . రుచిగా ఉండే జామపండును లేదా జామకాయను తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా? వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి జామకాయలో కంటే జామ ఆకుల్లోనే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు.

ముఖంగా జామఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలను చూసినట్లైతే జామఆకుల్లో నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఇన్ని ఆరోగ్యప్రయోజనాలకు ప్రధాణ కారణం జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరయు విటమిన్ సి. అంతే కాదు ఈ ఆకుల్లో క్వర్సిటిన్, ఫ్లవనోల్ అనే శరీరానికి అవసరం అయ్యే మంచి ఫ్లెవనాయిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో జామ పండు పై తొక్క తొలగించి పంచదార పాకం పట్టి ఎరుపు రంగు కలిపి రెడ్ గోవా అనే పేరుతో విక్రయిస్తారు.

ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్న జామఆకులు ఏవిధంగా ఉపయోగించాలంటే టీ రూపంలో తీసుకుంటే మరింత ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. మరి జామ ఆకు టీ ఎలా తయారుచేయాలో చూద్దాం...నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. ఇలా తయారుచేసిన టీకి పంచదార లేదా తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు. అయితే పాలను చేర్చకూడదు. ఈ టీతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. ఇవే కాకుండా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఈ క్రింది విధంగా...

1. బరువు తగ్గిస్తుంది:

జామ ఆకులో కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషదం వంటిది. జామాకుతో తయారుచేసిన రసాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. జామఆకులో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు.

2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

జామకాయ జ్యూస్ కాలేయానికి ఒక మంచి లివర్ టానిక్ వంటిది. ఈ జ్యూస్ ను తీసుకొన్నప్పుడు. ఎలాంటి దుష్ర్పభాలు లేకుండా ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

3. డయాబెటిస్ ను నివారిస్తుంది:

మీ కుంటుంబంలో కనుక ఎవరికైన డయాబెటిస్ ఉన్నట్లైతే జామకు టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల షుగర్ ను తగ్గించుకోవచ్చు . ఈ టీ బ్లడ్ లోని గ్లూకోజ్ లెవల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది . ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

4. డయోరియా నివారిస్తుంది:

జామఆకు వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం డయోరియా సమస్యలను నివారిస్తుంది . అంతే కాదు, ఇతర పొట్ట సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. జామ వేర్లు ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి కాలీ పొట్టతో తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జామఆకులతో తయారుచేసిన టీని రెగ్యులర్ గా తీసుకుంటుంటే ఇది జీర్ణక్రియకు అవసరం అయ్యే జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది . ఈ హెల్తీ లీఫ్ టీ లేదా జ్యూస్ తీసుకొన్నప్పుడు ఫుడ్ పాయిజన్ ను నివారించుకోవచ్చు.

6. దంత సమస్యలు:

అలాగే, జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ళ వ్యాధులను నివారించడంలో జామఆకులు గ్రేట్ గా సహాయపడుతాయి . జామఆకులను పేస్ట్ గా తయారుచేసి, దంతాలు మరియు చిగుళ్ళమీద అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. డేంగ్యూ ఫీవర్ నుండి రక్షణ కల్పిస్తుంది:

జామఆకుల వల్ల మరో గ్రేట్ హెల్త్ బెనిఫిట్, డేంగ్యూతో బాధపడే వారికి ఈ లీఫ్ జ్యూస్ ఔషధం వంటిది . శరీరంలో ఎలాంటి క్రిములనైనా నాశనం చేస్తుంది.

8. ప్రొస్టేట్ క్యాన్సర్:

జామఆకుల జ్యూస్ త్రాగడం వల్ల ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ ఎన్ లార్జ్ మెంట్ ను నివారిస్తుంది . పురుషుల్లో ఇలాంటి క్యాన్సర్స్ కు ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

9. స్పెర్మ్ ఫ్రొడక్షన్ కు చాలా మంచిది:

జామఆకులతో తయారుచేసిన టీని రెగ్యులర్ గా తీసుకుంటుంటే వీరకణాల ఉత్పత్తి పెరుగుతుంది .

10. అలర్జీలను నివారిస్తుంది:

మరో హెల్త్ బినిఫిట్ పుల్లల్లో సాధారణంగా వచ్చే ఎలాంటి ఎనర్జీలైన చాలా గ్రేట్ గా నివారిస్తుంది.

11. మలబద్దకం:

జామ ఆకులో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .

12. చర్మఆరోగ్యానికి :

చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తికి ఇది కీలకము . నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. దాని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది

Post a Comment

0 Comments