GET MORE DETAILS

ఆగమశాస్త్రంలో 'దుర్గ' రూపాలు తొమ్మిది రకాలు.

 ఆగమశాస్త్రంలో 'దుర్గ' రూపాలు తొమ్మిది రకాలు.




/సేకరణ/

జి.బి.విశ్వనాథ,

అనంతపురం,

9441245857.

ఆగమశాస్త్రం ప్రకారము దుర్గాదేవి తొమ్మిది రూపాలతో వుంటుంది. ఆ రూపాలేమిటంటే (1) నీలకంఠి (2) క్షేమంకరి (3) హరసిద్ధి (4) రుద్రాంశదుర్గ (5) వనదుర్గ (6) అగ్నిదుర్గ (7) జయదుర్గ (8) వింధ్యవాసిదుర్గ (9) రిపుమారిదుర్గ.

 ఆగమాకారాలుగా వున్న దుర్గ రౌద్రాకారములో వున్నపుడు ఎనిమిది బాహువులుంటాయి. ఒకోచేతిలో ఒక్కో ఆయుధముంటుంది. అవి (1) చక్రము (2) ఖడ్గము (3) ఖేతకము (డాలు)  (4) బాణము (5) పాశము (6) అంకుశము (7) ధనస్సు (8) త్రిశూలము.

దుర్గవాహనముగా సింహము లేదా పులి వుంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒక్కటి వుండవచ్చును.

ఇంకా ఆగమాలలో చెప్పిన రూపములోనే కాకుండా దుర్గాదేవి, భద్రకాళి, చండి, గౌరి, కాత్యాని,అన్నపూర్ణ, విశాలాక్షి, మీనాక్షి వంటి రూపాలలో కూడా దర్శనమిస్తుంది.

దుర్గ రూపాలలో మహిషాసురమర్దిని రూపం విశిష్టమైనది. అజంతా, ఎల్లోరా , మహబలిపురం గుహలలో ఈ రౌద్రరూపాన్ని చక్కగా శిల్పికరించారు.మహిషాసురమర్ధిని రూపంలో వున్నపుడు 16 చేతులుంటాయి. విష్ణుచిహ్నాలైన శంఖు చక్ర ఖడ్గాలు ఈ రూపంలో ఉండటము విశేషమని చెప్పుకోవాలి, ఇంకా వజ్రాయుధము, ఈటె,విల్లు, స్రుక్కు (ఒకరకమైన గరిటె) శ్రువము, పాశము, పరుశువులు కూడా వుంటాయి. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరిస్తున్న రూపంలో దుర్గ వుంటుంది.

మరో విశిష్టమైన రూపము కాళి. కాళి,భద్రకాళి, మహాకాళి రూపాలలో అమ్మవారు తీక్షణమైన చూపులను, పెదవులను దాటిన కోరపండ్లతో ఆసీనభంగిమలో వుంటుంది. 

శిరస్సు మీద అగ్ని మండుతూవుంటుంది, కపాలమాలలు ధరించి వుంటుంది.

భద్రకాళి రూపములో అమ్మవారికి 16 చేతులుంటాయి. ఈ చేతులలో పైన చెప్పిన ఆయుధాలతోపాటు కమండలము, శ్రువ, కపాలము వంటి ఆయుధాలు కలిగివుంటుంది. శ్రువమంటే గరిటే. గరిటే కూడా ఆయుధమా ? అమ్మవారు అన్నపూర్ణ స్వరూపిణి. అన్నదాత, ఆశ్రయించిన వారినెవరిని పస్తులుంచదు. అంతే యజ్ఞయాగాలలో అగ్నిగుండములో  ఆజ్యము (నేయ్యి) జారవిడవటానికి శ్రువము అవసరము. 

ఇప్పుడు తెలిసిందా ఆమె ఆయుధాలలో శ్రువము ఎందుకుందో !

శివుడి అర్ధాంగి పార్వతి, ఈమె దుర్గాశక్తిగా వున్నపుడు ఈ దేవత విగ్రహాలు లేదా శిల్పాలు లేదా మూర్తులు స్థానంభంగిమలోనే వుంటాయి.పార్వతి రూపములో వున్నపుడు ఆసీనభంగిమలో వుంటాయి.స్థానకమంటే నిలబడిన భంగిమ, ఆసీన అంటే కూర్చున్న భంగిమ. దుర్గమాత రౌద్రరూపములోను సాత్విక (Soft) రూపములోను వుంటుంది. ఇతిహాసాలను బట్టి రెండు లేదా నాలుగు లేదా ఎనిమిది చేతులు కలిగి, సర్వభరణాలను కలిగివుంటుంది. రెండు చేతులున్నపుడు కుడిచేతిలో పద్మము ఎడమ చేయి కటి (నడుము) మీద వుంటుంది. చతుర్హస్తాలతో  వున్నపుడు పై రెండు చేతులలో పాశము, అంకుశముతోను, కింది రెండు చేతులు అభయ వరద ముద్రలతో వుంటాయి.సాత్వికరూపంలో అమ్మవారు ప్రసన్నవదనముతో వుంటుంది.


Post a Comment

0 Comments