GET MORE DETAILS

53వ వసంతంలోకి అడుగుపెట్టిన జగదాంబ థియేటర్ (విశాఖపట్నం)

53వ వసంతంలోకి అడుగుపెట్టిన జగదాంబ థియేటర్ (విశాఖపట్నం) 



రాష్ట్రంలో విశాఖపట్నం తెలియని వాళ్ళు ఉంటారు ఏమో కాని జగదాంబ జంక్షన్ తెలియని వాళ్ళు ఉండరని విశాఖపట్నం లో నానుడి... ఈ జంక్షన్ లో జగదాంబ థియేటర్ ఉండడం వలన జగదాంబ జంక్షన్ పేరు వచ్చింది.

రాష్ట్రంలో ఈ థియేటర్ కి ఉన్నంత పేరు ఏ థియేటర్ కి లేదు అంటే అతియోశక్తికాదు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ థియేటర్ కంటే ముందే థియేటర్లు ఉన్న జగదాంబ థియేటర్ ప్రత్యేకత వేరు.

ఈ థియేటర్ 25.10.1970 లో ప్రారంభించారు. మొదటి సినిమాగా  Where Eagles Dare వచ్చింది. సుమారు 20 సంవత్సరాలు వరకు హిందీ,ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే ఆడాయి. తరువాత కాలంలో తెలుగు సినిమాలు ఆడటం మొదలు అయ్యాయి.

విశాఖ నగరంలో తిరిగే సిటీ బస్ ల్లో నేమ్ బోర్డు లో కూడా జగదాంబ అనే పేరు ఉంటుంది. ఎవరినైనా కలుసుకోవాలి అన్నా అందరికి తెలిసిన ప్రాంత మైన జగదాంబ జంక్షనే ల్యాండ్ మార్క్.

ఈ థియేటర్ లో 1989 లో విడుదలైన శివ సినిమా 156 రోజులు ఆడింది. ఈ థియేటర్ రికార్డ్ ఇదే! 

సినిమా రంగంలో ఏదైనా కొత్త టెక్నాలజీ (థియేటర్ కి సంబంధించిన)  వస్తే ఈ థియేటర్ కి  రావలసిందేసుమా! ఈ థియేటర్ మొత్తం సిట్టింగ్ కెపాసిటీ 1016 సీట్లు. అత్యంత టెక్నాలజీతో ఉన్న థియేటర్ జగదాంబ.

ఇవండి విశేషాలు మన విశాఖ నగరంలో ఉన్న మన జగదాంబ థియేటర్.

Post a Comment

0 Comments