GET MORE DETAILS

కార్తీకమాసంలో దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

కార్తీకమాసంలో దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు



1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.

2. వె౦డిని దానం చేస్తే – మనశ్శాంతి కలుగుతుంది.

3. బ౦గారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి.

4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి, సిద్ధి కలుగుతాయి.

5. పెరుగు దానం చేస్తే – ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్యంగా ఉ౦టారు.

7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.

8. తేనె దానం చేస్తే – సంతానం కలుగుతుంది.

9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే – అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

11. దీపాలు దానం చేస్తే – కంటి చూపు మెరుగు పడుతుంది.

12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది

14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతుంది.

15. అన్న దానం చేస్తే – పేదరికం పోయి, ధనవృద్ధి కలుగుతుంది.

పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…

వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.

Post a Comment

0 Comments